సింహం మీద బాలయ్య సవారీ.. దుమ్మురేపుతున్న మ్యాన్షన్ హౌజ్ యాడ్ !

నటసింహం నందమూరి బాలకృష్ణకి సపరేట్ ఫాలోయింగ్ ఉంది. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నారు. తెరపై ఆయన మాస్ డైలాగ్స్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి భారీ ఫాలోయింగ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో సైతం అభిమానులు ఉన్నారు. అంతే కాకుండా మాస్ ఇమేజ్‌తో పాటు ఆయన వల్ల ఒక ఆల్కహాల్ బ్రాండ్‌ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.

ఆ బ్రాండ్ పేరు మ్యాన్షన్ హౌస్.. బాలయ్య ఈ డ్రింక్ తాగుతారని పలు ఇంటర్వ్యూల్లో కూడా వ్యాఖ్యానించారు. బాలయ్య పాపులారిటీతో మ్యాన్షన్ హౌస్ పేరు ప్రజల్లో విపరీతంగా పాపులర్ అయింది. ఆహాలో బాలయ్య హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్' షోకి ఈ బ్రాండ్ స్పాన్సర్ గా మారింది. కేవలం సోషల్ మీడియాలో ట్రెండ్ అవడమే కాకుండా బ్రాండ్ స్ట్రాటజీలో కూడా ఇప్పుడు భాగం అయిపోయినట్టు తెలుస్తోంది.

nandamuri-balakrishna-mansion-house-brand-advertisement-goes-viral

మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోలు ఇప్పటికే పలు యాడ్స్ చేస్తున్నారు. బాలయ్య కూడా ఇప్పుడు బ్రాండ్ కమర్షియల్స్ రంగంలోకి అడుగుపెట్టారు. ఇటీవలే మ్యాన్షన్ హౌస్ డ్రింకింగ్ వాటర్ కోసం బాలయ్య యాడ్ చేశారు. ఇందులో బాలయ్య సింహం మీద సవారీ చేస్తూ వచ్చి చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ గా మారింది. ముఖ్యంగా ఆ యాడ్ లో.. అన్నిటిని లవ్ చెయ్, లయన్ హార్ట్ తో వెల్కమ్ చెయ్.. జిందగీలో ఏదైనా దిల్ ఓపెన్ చెయ్, లైఫ్ వెల్కమ్ చెయ్.." అని చెప్పే డైలాగ్ కి ఫ్యాన్స్ అంతా ఫుల్ ఫిదా అవుతున్నారు.

అయితే నటసింహం అంటూ బాలయ్యను సింహంతో అభిమానులు పోలుస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏకంగా సింహం మీద బాలయ్య రైడ్ చేస్తూ రావడం అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంది. ఇక బాలయ్య సినిమా విషయానికి వస్తే, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న 'అఖండ 2' చిత్రంపై భారీ అంచనాలున్నాయి. 'సింహ', 'లెజెండ్', 'అఖండ' వంటి హిట్ చిత్రాల తర్వాత బాలయ్య - బోయపాటి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుంది.

ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరిస్తుండడం మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+