రజనీకాంత్‌కి బిగ్ షాక్ ఇచ్చిన బాలయ్య.. అసలు ఊహించలేదు !!
సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ పేరు బ్రాండ్. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఆయనకు భాషతో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కేవలం ఇండియా లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా రజినీకి ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా జపాన్, థాయ్ లాండ్, బ్యాంకాక్ సహా పలు దేశాల్లో సూపర్ స్టార్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ స్టార్ హీరో.. ఇటీవలే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ మూవీ ఆడియన్స్ ని ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.
ప్రస్తుతం రజనీకాంత్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో 'జైలర్ 2' మూవీలో నటిస్తున్నారు. 2023లో వీరి కాంబినేషన్ లో వచ్చిన 'జైలర్' చిత్రం భారీ విజయాన్ని సాధించింది. మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ వంటి ప్రముఖ నటుల గెస్ట్ అప్పియరెన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. రజనీకాంత్ క్రేజ్ ఏంటో మరోసారి నిరూపించింది. దీంతో సీక్వెల్ గా రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సీక్వెల్‌లో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ పాత్రలతో పాటు మరో తెలుగు స్టార్ హీరో కూడా కీలక క్యామియో రోల్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పాత్రలో టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణ నటించనున్నారన్న ప్రచారం సినీ వర్గాల్లో బాగా వినిపించింది. రజినీకి నందమూరి ఫ్యామిలీకి ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. దాంతో ఆయన నటించడం పక్కా అని ఫిక్స్ అయ్యారు. ఏపీకి చెందిన పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా స్పెషల్ రోల్ చేయబోతున్నారని గుసగుసలు సైతం వినిపించాయి.
రజినీకి బిగ్ షాక్..
కానీ ఇప్పుడు అనూహ్యంగా ఈ సినిమా నుంచి బాలయ్య తప్పుకున్నట్లు తెలుస్తోంది. అందుకు స్పష్టంగా కారణాలు తెలియకపోయినా.. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమే అంటూ సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్ లో 'అఖండ 2' తెరకెక్కుతుంది. అలాగే దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరో సినిమాకు కూడా కమిట్ అయ్యారు. ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో సినిమా చేసే ఛాన్స్ ఉందంటున్నారు. దీంతో బాలకృష్ణ స్థానంలో మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫజిల్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications