కొడుకని కూడా చూడను: మోక్షజ్ఞకు బాలయ్య హెచ్చరిక
నందమూరి మోక్షజ్ఞది సెప్టెంబరు ఆరోతేదీన పుట్టినరోజు. ఆ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సినీ ప్రియులను ఆకట్టుకుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా అరంగ్రేటం చేయడం ఖాయమైంది. సోషల్ కథతో మైథాలజీని జోడించి ప్రశాంత్ వర్మ చెప్పిన కథ బాలయ్యకు బాగా నచ్చడంతో ఓకే చెప్పేశారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతోంది. లెజెండ్ మూవీస్ పతాకంపై బాలయ్య రెండో కూతురు తేజస్విని, ఎస్ఎల్వీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కాబోతున్నాయి.
బోయపాటి శ్రీనుతో ఖరారు
నందమూరి బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేసే క్రమంలో అనేక జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు మంచి ప్రణాళికలు కూడా రచించారు. ప్రశాంత్ వర్మ చెప్పిన కథ మినిమం గ్యారంటీగా తోచింది. తనకున్న అభిమానులతోపాటు నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా చూసినా.. సినిమా బాగుందనే చిన్న టాక్ వచ్చినా కచ్చితంగా హిట్ స్టేటస్ అందుకుంటుంది. దీని తర్వాత సినిమాను కూడా బాలయ్య జాగ్రత్తగా ప్లాన్ చేశారు. హీరోకు భీభత్సమైన మాస్ ఎలిమెంట్స్ ఇచ్చి, హీరోయిజాన్ని పతాకస్థాయిలో చూపించే బోయపాటి శ్రీనును ఖరారు చేశారు. నిర్మాతలెవరనేది ఖరారు కాలేదు. బోయపాటి దర్శకత్వంలో నటించడంవల్ల మాస్ ఫాలోయింగ్ తో పాటు మంచి గుర్తింపు లభిస్తుందనే ఆలోచనలో బాలకృష్ణ ఉన్నారు.

మూడో సినిమాను కూడా నిర్ణయించిన బాలయ్య
ఈ సినిమా తర్వాత మూడో సినిమా ఎవరితో చేయాలనేది కూడా బాలయ్య నిర్ణయించారు. కామెడీ, ఎంటర్ టైనర్ తెరకెక్కించే అనిల్ రావిపూడికి ఇంతవరకు ఫ్లాప్ లేదు. అనిల్ తో సినిమా అయితే మినిమం గ్యారంటీ. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో భగవంత్ కేసరి వచ్చి సూపర్ హిట్ అయింది. తన వయసుకు తగ్గ పాత్రలో బాలయ్య చక్కగా ఇమిడిపోయారు. అనిల్ రావిపూడి అయితే మోక్షజ్ఞలో ఉన్న యాక్షన్ తోపాటు కామెడీని కూడా బయటకు తీస్తాడని భావిస్తున్నారు. ఇప్పటికే వెండితెరకు పరిచయం చేసే క్రమంలో మోక్షజ్ఞకు 30 సంవత్సరాలు వచ్చాయి. భవిష్యత్తులో చేయబోయే సినిమాలు మాత్రం ఎటువంటి ఆలస్యం లేకుండా తీయాలని బాలయ్య నిర్ణయించుకున్నారు. సినిమాల విషయంలో కఠినంగా మోక్షజ్ఞచేత పనిచేయిస్తేనే అతని భవిష్యత్తు బాగుంటుందని, ఈ విషయంలో ఎటువంటి రాజీపడే ఉద్దేశంలో బాలయ్య లేరని తెలుస్తోంది. ఈ విషయమై బాలకృష్ణ ఇప్పటికే మోక్షజ్ఞను హెచ్చరించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications