జూనియర్ ఎన్టీఆర్ తో బాలకృష్ణ?
నందమూరి బాలకృష్ణ ఎప్పుడైతే అన్ స్టాపబుల్ షో ప్రారంభించారో అప్పటి నుంచి ఆయన రేంజ్ మొత్తం మారిపోయింది. ఫ్యాన్స్ విపరీతంగా పెరిగారు. ఆ షో చేస్తే ఆయనే చేయాలి అంటున్నారు అభిమానులు. అంటే దీన్ని బాలయ్య ఏ రేంజ్ లో విజయవంతం చేశాడో అర్థం చేసుకోవచ్చు. మొదటి సీజన్ తోనే షో ఆగిపోతుందని అనుకున్నప్పటికీ బాలయ్య తనదైన శైలిలో షోను రక్తి కట్టించడంతో రెండో సీజన్ నుంచి మూడో సీజన్ కు చేరుకుంది.
మూడో సీజన్ కు బాలయ్య రెడీ అవుతున్నాడని వార్తలు వచ్చినప్పటికీ రాజకీయంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతుండటంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు.చంద్రబాబు అరెస్ట్ కావడంతో రాజకీయంగా బాలయ్య బిజీ అయ్యాడు. దీనివల్ల ఈ షో ఆలస్యమవుతోందని తెలుస్తోంది. అయితే ఈసారి మాత్రం చాలా గట్టిగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి దగ్గర నుంచి కేటీఆర్ వరకు అందరు సెలబ్రిటీలను గెస్ట్ లు రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. రామ్ చరణ్, చిరంజీవి, కేటీఆర్ తోపాటు వెంకటేష్ తదితరులున్నారు. ఎవరు వచ్చినా రాకపోయినా ప్టటించుకోరుకానీ ఈసారి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారంటున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త షేకవుతోంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల మీద దృష్టి పెట్టాడు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. ఒకవేళ ఆ షోకు వెళితే ఎన్నో నిజాలు బయటకు వస్తాయి. బాబాయ్ తో కలిసి అబ్బాయ్ అవన్నీ బయట పెడతాడా? అనేది తెలియదు. ఇన్నిరకాల కాంప్లికేషన్స్ మధ్య వీరిద్దరూ కలవడం అసాధ్యమని నెటిజన్లు అంటున్నారు. సోషల్ మీడయాలో వార్త వైరల్ గా మారడంతో బాబాయ్ షోకు అబ్బాయ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వస్తాడా? రాడా? అనేది జూనియర్ కే తెలవాలి.












Click it and Unblock the Notifications