చిరంజీవి వద్దన్న కథతో బాలకృష్ణ బ్లాక్ బస్టర్

సినీ పరిశ్రమలో ఒక హీరో వద్దన్న కథతో మరో హీరో హిట్ కొట్టడం లేదంటే ఫ్లాప్ కొట్టడం అనేది సర్వ సాధారణంగా జరుగుతుంటుంది. కాల్షీట్లు ఖాళీగా లేకపోవడం లేదంటే కథ నచ్చక లేదంటే ఇతరత్రా విషయాలవల్లో కొందరు హీరోలు కొన్ని కథలను చేయలేకపోతారు. అటువంటి కథలతో మరికొందరు హీరోలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందర్భాలు కోకొల్లలుగా ఉంటాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తిరస్కరించిన ఓ కథతో సినిమా చేసిన బాలకృష్ణ బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ఆ సినిమా ఏమిటనేది తెలుసుకుందాం.

బి.గోపాల్ దర్శకత్వంలో బాలయ్య, విజయశాంతి జంటగా వచ్చిన రౌడీ ఇన్ స్పెక్టర్ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దర్శకుడు ముందుగా ఈ చిత్రాన్ని చిరంజీవితో చేయాలని భావించి కథను వినిపించారు. అయితే కథ నచ్చినప్పటికీ కాల్షీట్లు ఖాళీగా లేకపోవడంతో చిరు దాన్ని చేయలేకపోయారు. దీంతో గోపాల్ ఈ కథను బాలకృష్ణకు చెప్పి ఒప్పించి చిత్రం చేశారు. ఈ సినిమా భారీ హిట్ సాధించింది. ఒకరకంగా చిరంజీవి ఖాతాలో పడాల్సిన సూపర్ హిట్ బాలయ్య ఖాతాలో పడిపోయింది.

nandamuri balakrishna was a block buster hit with chiranjeevis missed story

రౌడీ ఇన్ స్పెక్టర్ చూసిన తర్వాత చాలామంది చిరంజీవికన్నా బాలయ్యకే సరిగ్గా సెట్ అయిందని కామెంట్లు చేశారు. ఆ పాత్రలో ఆయన నటించిన తీరు, కనపరిచిన వైవిధ్యం అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా మిస్ అయినప్పటికీ తర్వాత బి.గోపాల్ ఇంద్ర సినిమా చిరంజీవితో చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ప్రస్తుతం విశ్వంభర సినిమాతో చిరంజీవి బిజీగా ఉన్నారు. దీనికి దర్శకుడు వశిష్ట. అలాగే బాలయ్య బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది విజయదశమికి ఈ చిత్రం విడుదల కాబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+