జూనియర్ ఎన్టీఆర్ కు పోటీగా మోక్షజ్ఞ!!
నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ తెలుగు సినీ పరిశ్రమలోకి ఎప్పుడు అడుగు పెడతాడా? అనే ఆసక్తితో అందరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. నందమూరి అభిమానులైతే ఎప్పుడెప్పుడు అతను పరిశ్రమలోకి అడుగు పెడతాడా? అంటూ ఆత్రుతగా చూస్తున్నారు. అదిగో వస్తున్నాడు.. ఇదిగో వస్తున్నాడంటూ వార్తలు రావడం, అవి నిజం కాకపోవడంతో వారంతా నిరాశ చెందడం జరుగుతోంది. అతనికి పరిశ్రమ మీద ఆసక్తి ఉందా? లేదా? విషయంలో ఎవరికీ స్పష్టత రావడంలేదు.
వారసుడి గురించి ఎప్పుడు అడిగినా బాలయ్య మాత్రం వచ్చే ఏడాది అంటూ మాట దాటవేస్తూ వస్తున్నారు. దీనిపై స్పష్టత మాత్రం ఇవ్వడంలేదు. మరోవైపు మోక్షజ్ఞ హీరోకు సరిపడే విధంగా లేడని, శరీరాకృతి మార్చుకోవాలని, లావు తగ్గాలంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. కొంత సమయం తీసుకున్న తర్వాత హీరోలా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే మోక్షజ్ఞ లుక్ మొత్తం మారిపోయింది. గతంలో బొద్దుగా కనిపించిన బాలయ్య కుమారుడు ఇప్పుడు బరువు తగ్గి స్మార్ట్ గా కనపడుతున్నాడు. అంతేకాదు.. మంచి ఫిట్ నెస్ తో హీరోగా లాంచ్ అవడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మోక్షజ్ఞకు సంబంధించిన కొత్త ఫొటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నలుపు రంగు దుస్తుల్లో కుర్రాడు కేక పెట్టిస్తున్నాడంటున్నారు.

అతని లుక్ లో అన్నలు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా కనపడుతున్నారు. కళ్లు, కర్లీ హెయిర్ చూస్తుంటే టీనేజ్ లో అన్నలిద్దరూ ఉన్నట్లుగా మోక్షజ్ఞ ఉన్నాడనే టాక్ నడుస్తోంది. బాలయ్య కొడుకా మజాకానా.. అన్నలను మించి అందంగా తయారయ్యాడు.. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే హీరోగా ప్రవేశపెడితే బాగుంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బాలయ్య ఈ ఏడాదైన తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తాడో? లేదో? చూడాలి మరి.












Click it and Unblock the Notifications