Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాని 'ప్యారడైజ్' దెబ్బకి పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్' హో గయా !

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ఆయన నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్టైనర్ మూవీ "ది ప్యారడైజ్‌". ఇందులో నాని సరసన కయాడు లోహర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మంచు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలానే బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్, హీరో సంపూర్ణేష్ బాబు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీలో నాని 'జడల్' అనే పాత్రలో కనిపించనున్నాడు. కాగా ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ సైతం సెన్సేషన్ గా మారాయి. చేతిపై లం********* కు అనే టాటూ, అసభ్య పదజాలం మాత్రం అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది.

ఇప్పుడు లేటెస్ట్ గా మంగళవారం (ఫిబ్రవరి 24) నాడు నాని పుట్టిన రోజు సందర్భంగా 'ఆయా షేర్‌' అనే ఫస్ట్ సింగిల్ లాంచ్ చేశారు. ''హే నీయయ్యా జాగీరా.. మావోడు వచ్చిండ్రా.. ఆయా షేర్‌'' అంటూ సాగిన ఈ సాంగ్ ఫుల్ ట్రెండింగ్ గా మారింది. జడల్ క్యారక్టర్ ని ఎలివేట్ చేసేలా కాస్ట్యూమ్స్, సెటప్ అంతా కొత్తగా ఉన్నాయి. నాని సిగరెట్ తాగుతూ వేసే స్టెప్, జడలు పట్టుకొని వేసే సిగ్నేచర్ స్టెప్పులు అదరగొట్టాడు. చాలా కాలం తర్వాత తన మాస్ డ్యాన్సులతో అలరించారు.

nani-aaya-sher-song-from-paradise-beat-pawan-kalyan-aura-of-usthad-and-continues-on-trending

ఇప్పటికే దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్న ఈ హీరో.. రీసెంట్ గానే హిట్ 3 సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అటు నిర్మాతగా కూడా 'కోర్టు' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో "ది ప్యారడైజ్ " మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన 'దసరా' మంచి హిట్ సాధించడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాకి రాక్ స్టార్ అనిరుధ్ రచిచందర్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాదీ నేపథ్యానికి తగ్గట్టుగా 'ఆయా షేర్‌'పాటకు కాసర్ల శ్యామ్‌ హిందీ తెలుగు మిక్స్ చేసి సాహిత్యం సమకూర్చారు. సుధాన్ ఈ పాటకి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేయగా.. అడ్డుల జంగిరెడ్డి, అర్జున్‌ చందీ ఆలపించారు. ఈ పాట రిలీజ్ అయిన గంట లోనే 150K లైక్స్ మార్క్ ని దాటేసి 24 గంటల్లో సాలిడ్ రికార్డులను నమోదు చేస్తుంది.

అయితే మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం "ఉస్తాద్ భగత్ సింగ్". ఇప్ప‌టికే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, ఓజీ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చిన పవన్.. ఈ మూవీని కూడా త్వరగా రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీని.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా నుంచి కూడా ఆరా ఆఫ్ ఉస్తాద్ అనే సాంగ్ రిలీజ్ చేశారు. కానీ ఇది మాత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. 2 రోజుల్లో కేవలం 150K లైక్స్ మార్క్ ని మాత్రమె అందుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. ఫ్యాన్స్ కి సైతం సాంగ్ పెద్దగా ఆకట్టుకోలేదని.. సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో నాని ప్యారడైజ్ దెబ్బకి పవన్ ఉస్తాద్ సాంగ్ హో గయా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం నెట్టింట రచ్చ లేపుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+