'హిట్ 3'మూవీ రివ్యూ..నీకో దండం రా సామి
తెలుగు యంగ్ హీరోల్లో నాని కూడా ఒకరు. నాని క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో నానికి విపరీతమైన పాపులారిటీ ఉంది. తనదైన నటనతో నాని అన్ని వర్గాల ప్రేక్షకులను నాని ఆకట్టుకుంటున్నాడు. తన నటనకు తగ్గట్టుగానే న్యాచురల్ స్టార్ అనే బిరుదు కూడా సంపాదించుకున్నాడు. నాని తన సినీ ప్రయాణాన్ని సహాయ దర్శకుడిగా ప్రారంభించి, ఆ తర్వాత నటుడిగా మారారు. ఆయన తన సహజమైన నటనతో, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నాని నిర్మాతగా వ్యవహరిస్తూ..హీరోగా నటించిన సినిమా హిట్ 3. శైలేష్ కొలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కథ
'అర్జున్ సర్కార్' అనే ఒక రూత్ లెస్ పోలీస్ ఆఫీసర్. పై అధికారులు చెప్పిన మాటలు వినకుండా , తనకు నచ్చిన విధంగా డ్యూటీ చేస్తుంటాడు. ఈ సినిమాలో నాని కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఒక పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. అలాంటి వ్యక్తికి ఓ చిన్న పాప కిడ్నాప్ కేసును అప్పగిస్తారు. దానిని సాల్వ్ చేయడానికి ఆయన ఎలాంటి డిసీజన్స్ తీసుకున్నాడు. కేసును ఛేదించే క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి.. వాటిని ఎలా ఎదుర్కొని ఈ కేసును ఎలా ముగించాడనదే మిగిలిన కథ.

విశ్లేషణ
హిట్ సినిమా సిరీస్‌లో భాగంగానే శైలేష్ కొలన్ ఈ కథ రాసుకుకున్నట్టు స్పష్టం అవుతుంది. గత రెండు పార్టులుగా మాదిరిగానే ఈ సినిమాను కూడా మర్డర్, మిస్టరీగా తెరకెక్కించాడు దర్శకుడు. ఫస్ట్ భాగంగా కన్నా , రెండో భాగం మరింత ఆసక్తికరంగా మార్చాడు దర్శకుడు. ముఖ్యంగా సెకండాఫ్ మొత్తం కూడా రక్తపాతంతో నిండిపోతుంది. ఊహించని ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి. మొదటినుంచి చివరి వరకు సినిమాని చాలా ఎంగేజింగ్ గా నడిపించడంలో శైలేష్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అయితే కొన్ని లాజిక్ లేని సీన్లను కూడా కథలో ఇరికించే ప్రయత్నం చేశాడు.
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే నాని మరోసారి తనదైన నటనతో అదరగొట్టాడు. ఈ సినిమాకు బ్యాక్ బోన్‌గా నిలిచాడు నాని. అర్జున్ సర్కార్ అనే ఒక క్యారెక్టర్‌లో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని వ్యక్తిగా తన నటనలోని మరో కోణాన్ని బయటకు తీశాడు. ఇలాంటి ఆఫీసర్ మనకు ఎదురైతే పరిస్థితి ఏంటీ అనే ప్రశ్న ఎదురయ్యేలా నటించాడు. ముఖ్యంగా సెకండ్ ఆఫ్‌లో వచ్చే కొన్ని సీన్లలో నాని తన నటనతో మెంటల్ ఎక్కించాడు. ఆయన నటనకు దండం పెట్టాల్సిందే. హీరోయిన్ శ్రీనిధి శెట్టి తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉన్నట్టు అనిపించదు. మిగిలిన నటులు తమ పరిధి మేర నటించారు.
టెక్నికల్ అంశాలు
మిక్కీ జే మేయర్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకున్నట్టు అనిపించదు. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకి ఇలాంటి మ్యూజిక్ సెట్ అయినట్టు అనిపించలేదు.కెమెరా పనితనం బాగుంది. ప్రొడక్షన్ విలువలు బాగున్నాయి. దర్శకుడు శైలేష్ అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయినప్పటికీ తను రాసుకున్న స్క్రీన్ ప్లే లో ఎక్కడా కూడా డౌటు రాకుండా ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యాడు.
ప్లస్ పాయింట్స్
నాని
సెకండాఫ్
డైరెక్షన్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
మిక్కీ జే మేయర్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్
అక్కడక్కడ కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి.
-
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి "అంజనా దేవి"కి స్పెషల్ అవార్డు..! -
వారణాసిపై సెటైర్లు- దెబ్బకు దిగొచ్చిన హరీష్ శంకర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
"20 ఏళ్ల క్రితం మీ అమ్మను చూసుంటే పెద్ద హీరోయిన్ ను చేసేవాడ్ని" -
ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటివరకు రాని కథతో సినిమా..! -
కోకాపేట్ అల్లు సినిమాస్ లాంచ్ తేదీ అనౌన్స్: ఆ సినిమాలతో బోణీ -
అప్పుడు టీవి యాంకర్.. ఇప్పుడు ఏకంగా సినిమాకి రూ.20 కోట్లు !! -
మళ్లీ నోరు జారిన రాజేంద్రప్రసాద్.. ఏకంగా మాజీ సీఎంపై.. వీడియో -
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. ప్రభాస్ మెచ్చిన సినిమా.. -
నా భర్తకు ఇవి ఉంటే చాలు: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
కెమెరా ముందే వాంతులు చేసుకున్న చిన్నారి పెళ్లికూతురు.. అసలేమైంది! వీడియో












Click it and Unblock the Notifications