రికార్డుల ఊచకోత.. భారీ ధరకు "ప్యారడైజ్" ఆడియో రైట్స్ !
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ హిట్లు అందుకున్న ఈ హీరో.. రీసెంట్ గానే హిట్ 3 సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. దీంతో తన విజయపరంపరను కొనసాగిస్తున్నాడు. నిర్మాతగా కూడా 'కోర్టు' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో హీరోయిన్ గా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటించింది. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని సమకూర్చగా.. నానినే నిర్మాతగా వ్యవహరించారు. వరుసగా నాలుగు హిట్స్ పడడంతో నాని రేంజ్ మారుతోంది అని అంటున్నారు.
ఇన్నాళ్లు లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలు చేసిన నాని దసరాతో రూట్ మార్చగా.. సరిపోదా శనివారం చిత్రంతో అదరగొట్టి.. హిట్ 3 తో ఫుల్ మీల్స్ అందించాడు. దాంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దసరా లాంటి భారీ హిట్ తరువాత నాని - శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో మొదటి నుంచి అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ సైతం సెన్సేషన్ గా మారాయి. చేతిపై లం********* కు అనే టాటూ, అసభ్య పదజాలం మాత్రం అందరికీ ఊహించని షాక్ ఇచ్చింది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా రా అండ్ రస్టిక్ మోడ్ లో నాని కనిపించారు. అయితే ఇంకా ఈ చిత్రం పూర్తిగా పట్టాలెక్కక ముందే ఈ మూవీకి సంబంధించి ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో ఫుల్ గా చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్టు టాక్ నడుస్తోంది.
ప్యారడైజ్ సినిమా ఆడియో రైట్స్ ను సరిగమ గ్లోబల్ సంస్థ దక్కించుకుందని అంటున్నారు. అందుకోసం ఈ సంస్థ ఏకంగా రూ.18 కోట్లు చెల్లించిందని హాట్ టాపిక్ నడుస్తోంది. సినిమా ఇంకా పూర్తి కాక ముందే ఈ రేంజ్ లో బిజినెస్ జరుగుతుండడం పట్ల నాని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
మరోవైపు ఈ చిత్రంలో నాని తల్లి పాత్రలో సోనాలి కులకర్ణి నటిస్తున్నట్లు మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నటి రమ్యకృష్ణ తల్లి క్యారెక్టర్ లో నటిస్తున్నారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అంతే కాకుండా ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు విలన్ రోల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కథ నచ్చడంతో మోహన్ బాబు కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.












Click it and Unblock the Notifications