నాని ‘పారడైజ్’కు మళ్లీ బ్రేక్? రిలీజ్ డేట్‌పై సస్పెన్స్!

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ది పారడైజ్' రిలీజ్ డేట్‌పై మళ్లీ అనిశ్చితి నెలకొంది. ఈ సినిమాను కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా పాన్-ఇండియా స్థాయిలో పలు భాషల్లో భారీగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే 'ది పారడైజ్' హిందీ వెర్షన్ విడుదలకు సంబంధించి వస్తున్న తాజా వార్తలు ఇప్పుడు సినిమా రిలీజ్‌పై ప్రశ్నార్థకంగా మారాయి.

పక్కా హిట్ సినిమా గురు..అదిరిపోయిన టీజర్
పక్కా హిట్ సినిమా గురు..అదిరిపోయిన టీజర్

హిందీ వెర్షన్ తాత్కాలిక వాయిదా?
తాజాగా వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం 'ది పారడైజ్' హిందీ వెర్షన్ విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మునుపటి ప్రకటన ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఉత్తరాదిలో ఆశించిన స్థాయిలో ప్రమోషన్లు ప్రారంభం కాకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

Nani The Paradise Movie Release Postponed Big Update on Hindi Version Full Details Here

చిత్ర బృందం ఉన్న రెండు దారులు
ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ప్రణాళిక ప్రకారం సెప్టెంబర్ 24న తెలుగు వెర్షన్‌ను మాత్రమే థియేటర్లలోకి తెచ్చి హిందీ వెర్షన్‌ను ఆపివేస్తారా? లేదా పాన్-ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో ఒకేసారి గ్రాండ్‌గా విడుదల చేయడం కోసం సినిమా మొత్తాన్ని అక్టోబర్‌కు వాయిదా వేస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా మార్చి నుంచి ఆగస్టుకు, ఆ తర్వాత సెప్టెంబర్ 24కు వాయిదా పడుతూ వచ్చింది. కాబట్టి సరైన ప్రమోషన్ ప్లాన్ కోసం మరొకసారి తేదీ మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

రవితేజ 'ఇరుముడి' మూవీ మరో రికార్డు.. 80 లక్షలకు పైగా టికెట్స్ సేల్
రవితేజ 'ఇరుముడి' మూవీ మరో రికార్డు.. 80 లక్షలకు పైగా టికెట్స్ సేల్

నాని పాన్-ఇండియా కలలు
ఈ సినిమా విడుదల తేదీ నానికి కేవలం ఓ డేట్ మార్పు మాత్రమే కాదు. తన మార్కెట్‌ను పాన్-ఇండియా స్థాయిలో మరింత బలంగా విస్తరించుకోవడానికి 'ది పారడైజ్'ను ఓ పెద్ద మైలురాయిగా నాని భావిస్తున్నారు. హిందీని పక్కన పెట్టి కేవలం తెలుగులో సెప్టెంబర్ 24న రావడం ఓ మార్గమైతే.. అన్ని భాషల ప్రేక్షకుల వద్దకు ఒకేసారి తీసుకెళ్లేందుకు మొత్తం సినిమాను అక్టోబర్ కు వాయిదా వేయడమే సరైన నిర్ణయమని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం అధికారికంగా సెప్టెంబర్ 24 రిలీజ్ డేట్ ఉన్నప్పటికీ.. మేకర్స్ నుంచి త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+