"50 ఏళ్లు నిలదొక్కుకున్నానంటే.. నేను కూడా కమిట్మెంట్ ఇవ్వాలి కదా"

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్‌, శివానీ నగరం జంటగా నటించిన చిత్రం 'హే బల్వంత్'. ఈ మూవీకి గోపీ అచ్చర దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా సెన్సార్‌ బోర్డు ఈ సినిమా పేరు మార్చాలని సూచించడంతో చిత్ర బృందం దీని టైటిల్‌ ను మార్చింది. 'హే భగవాన్‌'ను 'హే బల్వంత్‌' గా మారుస్తున్నట్లు ప్రకటించింది.

ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకూ విడుదలైన గ్లింప్స్‌, టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అంతేకాక సుహాస్, శివాని నగరం గతంలో అంబాజీపేట మ్యారేజీ బ్యాండు సినిమా చేశారు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి.

అయితే ఈ మూవీ ప్రొమోషన్లలో భాగంగా టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు జవాబు ఇస్తూ.. 50 ఏళ్లు నేను నిలదొక్కుకున్నానంటే.. నేను కూడా కమిట్మెంట్ ఇవ్వాలి కదా.. అని హాట్ కామెంట్స్ చేశారు. దాంతో అక్కడున్నవాళ్లు పగలబడి నవ్వారు. నరేష్ కామెడీ టైమింగ్ కు హ్యాట్సాఫ్ అంటూ హీరో సుహాస్ నవ్వుకున్నారు. ఇక ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Naresh Fiery Comments at Hey Balwanth Press Meet Stood Firm for 50 Years Now My Commitment

ఇక 'లిటిల్‌ హార్ట్స్‌, 'రాజు వెడ్స్‌ రాంబాయి', 'ఈషా' వంటి బ్లాక్‌ బస్టర్స్‌ చిత్రాలను అందించిన బన్నీ వాస్, వంశీ నందిపాటిలు తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై 'హే బల్‌వంత్ ఎంటర్‌ టైనర్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోన్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 20న గ్రాండ్ గా విడుదల కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+