సంచలనంగా మారిన రష్మిక డీప్ ఫేక్ వీడియో

సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత దాన్ని అందిపుచ్చుకొని అభివృద్ధికి బాటలు వేసుకోవాలి. తద్వారా సమాజానికి ఉపయోగపడాలి. అయితే దురదృష్టవశాత్తూ సాంకేతికతను మంచికన్నా చెడుకే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కన్ను మూసి తెరిచేసరికి ప్రస్తుతం ఉన్న సాంకేతికత మారిపోయి కొత్తది అందుబాటులోకి వస్తోంది. మనం చేయని పనులు కూడా చేసినట్లుగా క్రియేట్ చేసి సామాజిక మాధ్యమాల్లో వాటిని వైరల్ చేస్తున్నారు. దీనివల్ల ఎన్నో జీవితాలు మారిపోవడమేకాదు.. వారికి జీవితకాలం అంతులేని వ్యథను మిగిల్చేలా చేస్తున్నాయి.

రెండుసార్లు ఇబ్బందిపడ్డ రష్మిక
కథానాయిక రష్మిక మందన్నా ఇప్పటికే రెండుసార్లు డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు. దీనికి సంబంధించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయినా మూడోసారి కూడా ఆమె డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు. ప్రస్తుతం వైరలవుతున్న ఈ వీడియోలో నలుపు రంగు బికినీ వేసుకున్న అమ్మాయికి రష్మిక ముఖాన్ని తగిలించారు. ప్రితి రాజ్‌పుత్ అనే పేరుతో ఉన్న ఫేస్ బుక్ ఐడీ నుంచి దీన్ని అప్ లోడ్ చేశారు. ఈ వీడియో చూసినవారంతా రష్మిక ఏమిటి.. ఇలాంటి వీడియో విడుదల చేసిందని అనుకున్నారు. అయితే అది డీప్ ఫేక్ అని తెలియడంతో ఆమె అభిమానులు మండిపడుతున్నారు.

national crush Rashmika Mandanna another Deepfake Video viral

భవిష్యత్తులో ఎవరూ చేయకుండా ఉండేలా
ఇటువంటి వీడియోలు సృష్టిస్తున్నవారిని పట్టుకొని కఠినంగా శిక్షిస్తే భవిష్యత్తులో ఎవరూ ఈ తరహా వీడియోలు చేసే సాహసం చేయరంటున్నారు. గతంలో కాజోల్, కత్రినా కైఫ్, అలియాభట్, నోరా ఫతేహి లాంటి హీరోయిన్లు కూడా డీప్ ఫేక్ బారిన పడ్డారు. నేషనల్ క్రష్ అనే బిరుదను సంపాదించుకున్న రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి పుష్ప2 సినిమా చేస్తున్నారు. డిసెంబరు ఆరోతేదీన విడుదల కాబోతోంది. జాగ్రత్తగా ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటున్న రష్మికకు ఆమె సినిమాలన్నీ హిట్ అవుతుండటంతో గెల్డెన్ లెగ్ అనే పేరు స్థిరపడిపోయింది. సినిమాకు రూ.5 కోట్ల వరకు పారితోషికం అందుకుంటోంది. విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉందని, త్వరలోనే వివాహం చేసుకుంటారనే వార్త మాత్రం సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ వైరలవుతుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+