నాని "హిట్ 3" తో హిట్ కొట్టాడా.. ట్విట్టర్ రివ్యూ !

నేచురల్ స్టార్ నాని.. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ప్రయాణం ప్రారంభించినప్పటికీ.. అష్టాచమ్మా సినిమాతో తెలుగు తెరకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి తనదైన శైలిలో విభిన్న పత్రాలు పోషిస్తూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. అయితే హ్యాట్రిక్ హిట్ లతో ఫుల్ జోష్ లో ఉన్న నాని.. ఈసారి రూట్ మార్చినట్టు తెలుస్తోంది. దసరా సినిమాలో మాస్.. హాయ్ నాన్నతో క్లాస్ ఆడియన్స్ ని అలరించిన నాని.. సరిపోదా శనివారంతో ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా కవర్ చేసి ఫుల్ మీల్స్ ఇచ్చారు. ఈసారి మాత్రం ఒరిజినల్ చూపిస్తానంటూ మరీ వాయిలెంట్ గా మారిపోయారు ఈ నేచురల్ స్టార్.

ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 థర్డ్ కేస్ మూవీలో నటించి, నిర్మించాడు నాని. ఈ చిత్రంలో హీరోయిన్ గా కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి నానికి జోడీగా నటించింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ఈరోజు విడుదల అయ్యింది ఈ మూవీ. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి మంచి స్పందన రావడంతో చిత్రం పై భారీ ఆశలే నెలకున్నాయి.

natural-star-nani-hit-3-movie-twitter-review

హిట్ ఫ్రాంచైజీలో వరుసగా సినిమాలు వస్తుండగా ఫస్ట్ కేసులో విశ్వక్ సేన్, సెకండ్ కేసులో అడవి శేష్ నటించారు. ఇప్పుడు హిట్ 3 లో నానితో పాటు.. అడవి శేష్ కూడా కనిపిస్తారని రీసెంట్ గానే లీక్ ఇచ్చారు. అయితే నాని ఎలా అయితే హిట్ 2 క్లైమాక్స్ లో కనిపించారో అలానే హిట్ 3 చివర్లో.. 'హిట్ 4'లో హీరోని రివీల్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దాంతో తమిళ్ హీరో కార్తీ ఉన్నారా లేదా అనేది తెలియాలంటే మూవీ చూడక తప్పదు.

ట్విట్టర్ రివ్యూ..

హిట్‌ 3 సినిమాకు ట్విట్టర్ లో మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంతమంది నెటిజన్స్‌ సినిమా మొదటి సగం అద్భుతంగా ఉందని, నాని నటన, రొమాంటిక్ ఎపిసోడ్‌లు ఆకట్టుకున్నాయని అంటున్నారు. నాని కొత్త జోన్‌లో కనిపించాడని, అతని నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చాలామంది పోస్టులు పెడుతున్నారు.

వయెలెన్స్‌ బలవంతగా ఇరికించడం, ట్విస్టులు,మలుపులు లేకపోవడం, స్క్రీన్‌ప్లే, బీజీఎం మైనస్‌ పాయింట్స్‌ అని మరో నెటిజన్‌ అభిప్రాయ పడ్డాడు

యాక్షన్ సీన్లతో గూస్ బంప్స్ పక్కా.. సినిమాను భారీ యాక్షన్స్ సీన్స్ తో హైలెట్ చేశారు. క్లైమాక్స్ మాత్రం మిస్ అవ్వొద్దు.. అని మరొకరు ట్వీట్ చేశారు. ఇక మీరు కూడా మూవీ చూసి మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి.

Take a Poll

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+