నేచురల్ స్టార్ ఫ్యాన్స్ కి నరాలు కట్.. ఆ డైరెక్టర్ తో నాని నెక్స్ట్ మూవీ

నేచురల్ స్టార్ నాని తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తన సహజ నటనతో అందరి మన్ననలు పొందాడు నాని. తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ ప్రయాణం ప్రారంభించినప్పటికీ.. అష్టాచమ్మా సినిమాతో తెలుగు తెరకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన నటించిన రైడ్, అలా మొదలైంది, పిల్ల జమీందార్ జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి. ఈగతో స్టార్ డమ్ తెచ్చుకున్న నాని.. భలే భలే మగాడివోయ్, మజ్ను, భీమిలి కబడ్డీ జట్టు, జెర్సీ సినిమాలతో ప్రేక్షకుల గుండెల్లో ముద్ర వేసుకోగలిగాడు. గడిచిన రెండేళ్లలో 'దసరా' 'హాయ్ నాన్న' 'సరిపోదా శనివారం' వంటి హ్యాట్రిక్ విజయాలతో మంచి జోష్ లో ఉన్నారు నాని.

ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 థర్డ్ కేస్ మూవీలో నాని నటిస్తున్నారు. ఆ తర్వాత 'ది ప్యారడైజ్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే సుజీత్ డైరెక్షన్ లో కూడా నాని నటించనున్నాడు. అయితే టాలీవుడ్ లో మినిమమ్ గ్యారంటీ హీరో అనే పేరు తెచ్చుకున్న నేచురల్ స్టార్ నానితో.. సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు ఎప్పుడూ రెడీగానే ఉంటారు. ఇప్పటికే పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న నాని.. ఇప్పుడు కొత్తగా మరో దర్శకుడిని లైన్ లో పెట్టినట్లుగా టాక్ వినిపిస్తోంది.

natural star Nani s next movie with that director

నాని శేఖర్ కమ్ములతో ఓ మూవీ కోసం చేతులు కలపబోతున్నారనే మాట వినిపిస్తోంది. ఫీల్ గుడ్ సినిమాలతో సెన్సిబుల్ డైరెక్టర్ గా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు శేఖర్ కమ్ముల. ప్రస్తుతం కింగ్ అక్కినేని నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్‌ లతో 'కుబేర' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి కాంబినేషన్ లో సినిమ ఫిక్స్ అయినట్టు చెబుతున్నారు. దీంతో శేఖర్ కమ్ముల మార్క్ డైరెక్షన్, నాని నేచురల్ యాక్టింగ్ కలిస్తే సినిమా సూపర్ హిట్ అని అభిమానులు భావిస్తున్నారు. నాని హిట్ 3 మే 1న రిలీజ్ కానుండగా.. కుబేర చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ రెండూ కంప్లీట్ అయ్యాక వీరి సినిమా ఉండవచ్చని అనుకుంటున్నారు.

మరోవైపు బాపు రాధా గోపాలం చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు నాని. నితిన్ అల్లరి బుల్లోడుకు కె.రాఘవేంద్రరావు దగ్గర, మంచు విష్ణు హీరోగా రూపొందిన అస్త్రం, ఢీ చిత్రాలకు దర్శకత్వ విభాగంలో పనిచేశారు. తరువాత రేడియో జాకీగా కూడా పని చేశారు. స్టార్ హీరోగా సాగుతున్న నాని నిర్మాత గానూ కొన్ని చిత్రాలు రూపొందించారు. డి ఫర్ దోపిడి చిత్రానికి సహ నిర్మాతగా మారిన నాని.. ఆ తర్వాత అ!, హిట్ 1, హిట్ 2 సినిమాలను నిర్మించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+