తెలుగు స్టార్ హీరోయిన్‌ను ఘోరంగా అవమానించిన నయనతార

నయనతారను లేడీ సూపర్ స్టార్ అంటారు. పొగరులో, అహంకారంలో, కళ్లు నెత్తికెక్కడంలో, తనొక రాకుమారి అని భ్రమించడంలో ఆమె సూపర్ స్టార్. తన ప్రవర్తనతో ఎంతోమంది అభిమానులను సినీతారలు సంపాదించుకుంటారు. కానీ తన అసహ్యకరమైన ప్రవర్తన, అహంభావంతో తనకున్న అభిమానులను కూడా దూరం చేసుకోవడంలో నయనతార ముందుంటుంది. ఏం చూసుకొని మిడిసిపడుతోంది.. ఏం చేసుకొని ఎగిరెగిరి పడుతోందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎన్ని సంఘటనలు జరిగినా, మీడియాలో ఎన్నిసార్లు వార్తలు వచ్చినా తన ప్రవర్తనను ఏమాత్రం మార్చుకోని నయనతార మరోసారి వివాదంలో చిక్కుకుంది. దక్షిణాదిలోనే టాప్ హీరోయిన్ గా చెలామణి అయిన మీనాను దారుణంగా అవమానించింది.

కనీసం మాట కూడా మాట్లాడలేదు
వాస్తవానికి మీనా చేసిన సినిమాలు, సూపర్ హిట్లతో పోల్చుకుంటే నయనతార స్థాయి చాలా తక్కువ. నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. కనీసం స్టేజీమీదకు వచ్చిన మీనాను నయనతార కనీసం ఒక్క మాట కూడా పలకరించలేదంటే ఆశ్చర్యపోతారు. అంతేకాదు.. పక్కపక్కనే ఉండి ఫొటోలు దిగినా కూడా మాట్లాడలేదంటే ఎంత పొగరుతో మిడిసిపడుతుందో నయనతారను చూస్తే అర్థమైద్ది. సుందర్ సి దర్శకత్వంలో నయనతార మూకుత్తి అమ్మన్2 సినిమా చేయబోతోంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగితే కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, అలనాటి తారలు ఖుష్ బూ, మీనాతోపాటు రెజీనా కసాండ్రా, కేఎస్ రవికుమార్, యోగిబాబు, గణేష్, హిప్ హిప్ ఆదితోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఖుష్ బూ, మీనా కలిసి స్టేజీమీదకు రాగా నయనతార ఖుష్ బూను కౌగిలించుకుంది. మీనాతో కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చిన్న నవ్వు కూడా నవ్వలేదు. దక్షిణాదిలో సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ప్రభు, కార్తీక్, అజిత్ లాంటి హీరోలందరితో మీనా నటించింది. కానీ ఏనాడూ ఈ తరహా ప్రవర్తనతో లేదు. ఎంత వినయంగా ఉండేది.

Nayanthara once again insults Telugu star heroine

నయనతారకు మీనా కౌంటర్
నయనతారకు మీనా కౌంటర్ ఇచ్చింది. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫొటోను షేర్ చేసింది. గొర్రెల మధ్యలో ఉండే సింహం.. గొర్రెలు తనగురించి ఏమనుకుంటున్నాయి అని ఆలోచించదు.. పట్టించుకోదు. మంచి మనసు చూసి గర్వపడాలని, కానీ అది అందరి దగ్గర ఉండదని రాసుకొచ్చింది. నయనతార గురించే మీనా ఇలా రాసిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పబ్లిక్ గా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించడంతోపాటు ధనుష్ వ్యవహారం, ఇంకా చాలా చాలా సంఘటనల్లో నయనతార యాటిట్యూడ్ గురించే చర్చ జరిగింది.. జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+