నాతో ఒక్క రాత్రి గడుపు అంటూ ఆమెకు మెసేజ్..ఇదేం పోయేకాలం బాసూ..!
ఇటీవలే తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తీకు విడాకులిచ్చారు. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంటకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అధికారికంగా తాము విడిపోతున్నట్టు జయం రవి తెలిపారు. అటు జయం రవి భార్య ఆర్తి సైతం విడాకులపై కీలక ప్రకటన చేశారు. విడాకులపై తనని సంప్రదించకుండానే ప్రకటించారని జయం రవి భార్య ఆర్తి ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు భార్య ఆర్తితో విడాకుల తర్వాత జయం రవి మరో అమ్మాయితో క్లోజ్‌గా మూవ్ అవుతూ కనిపించారు. జయం రవి కేనిషా ఫ్రాన్సిస్ అనే సింగర్‌తో రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారని రూమర్స్ తెర మీదకు వచ్చాయి.ఇదే సమయంలో వీరిద్దరు తరచుగా కలిసి దర్శనం ఇవ్వడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్టు అయింది.

అసలు ఆమెకు, జయం రవికి ఎలా పరిచయం ఏర్పడిందనేది చూస్తే, కేనిషా ఫ్రాన్సిస్ సింగర్. ఇండిపెండెంట్ ఆల్బమ్స్ పాడి పాపులర్ అయ్యింది. బెంగుళూరుకి చెందిన కేనిషా గోవాలోని పబ్‌లలో పాటలు పాడుతుంటుంది. తమిళంలో జీవా నిర్మించిన ఓ ఆల్బమ్‌లోనూ ఆమె పాటలు పాడింది. అడపాదడపా సినిమాల్లో పాడటంతోపాటు సోలో ఆల్బమ్స్‌తోనూ ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకుంది.జయం రవి తన సినిమాల షూటింగ్‌లు లేని టైమ్‌లో కాలేజ్ ఫ్రెండ్స్ తో కలిసి గోవాకి వెళ్తుండేవాడు.
అక్కడ పబ్‌కి వెళ్లినప్పుడు కేనిషా పరిచయం అయ్యిందని తెలుస్తోంది. ఈ పరిచయం ప్రేమగా మారడంతోనే జయం రవి తన భార్యకు విడాకులిచ్చారనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నారట. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమెను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. అసభ్యపదజాలంతో కేనిషాపై నెటాిజన్లు మండిపడుతున్నారు. జయం రవి దగ్గర ఉన్న డబ్బుల కోసమే ఇలా చేస్తున్నావ్ కదా అని కొందరు విమర్శిస్తుంటే..ఏయ్ వేశ్య మా రూమ్‌కు కూడా వచ్చి ఒక రాత్రి గడుపు అంతకంటే ఎక్కువ డబ్బులు ఇస్తామంటూ మరికొందరు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.

నెటిజన్ల కామెంట్లపై కేనిషా రియాక్ట్ అయ్యారు. నెటిజన్ల విమర్శలపై తన ఇన్‌స్టాగ్రామ్‌లోఓ సుదీర్ఘ పోస్ట్‌ను ఆమె షేర్ చేశారు. "మీ అందరి మాటల వల్ల నేను ఎంతో క్షోభ అనుభవిస్తున్నా, కర్మ ఎవరినీ విడిచిపెట్టదని, త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.చాలామందికి నిజం తెలియకపోవడం వల్ల నన్ను నిందిస్తూ దారుణంగా మాట్లాడుతున్నారు. మీ అందరి భావాలను నేను అర్థం చేసుకున్నా. కానీ త్వరలో నిజం బయటపడాలిని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఒకవేళ నేను తప్పు చేస్తే.. చట్టం వేసే శిక్షణను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా" అంటూ కేనిషా వాపోయారు. పెళ్లి, విడాకులు అనేది వారి వ్యక్తిగత విషయం. అలాంటిది పరిధి దాటి ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమని కేనిషాకు మద్దతుగా కొందరు నిలుస్తున్నారు.దీనిపై జయం రవి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ప్రస్తుతం కేనిషా షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications