బాడీ షేమింగ్ చేసిన నెటిజన్..దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సమంత..!
హీరోయిన్ సమంత ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య ఆరోగ్యానికి సంబంధించి కొన్ని టిప్స్ ఇచ్చింది సమంత. అయితే దీనిపై పెద్ద వివాదామే చేలరేగింది. మయోసైటిస్ వ్యాధికి సంబంధించిన ట్రీట్‌మెంట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. దీనిపై రియాక్ట్ అయిన ఓ డాక్టర్ ఇలాంటివి చెప్తున్న సమంతను జైలులో పెట్టాలని రాసుకొచ్చాడు.
ఒక రకంగా వార్నింగ్ ఇచ్చాడు. దీనిపై స్పందించిన సమంత తన డాక్టర్ గైడెన్స్ లో మాత్రమే తను ఇవన్నీ చేశానని చెప్పుకొచ్చింది. దీనిపై పలువురు హీరోయిన్లు సైతం రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత సమంతకు ఆ డాక్టర్ సారీ కూడా చెప్పడం జరిగింది. నాగ చైతన్యతో విడాకులు అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసింది. మయోసైటీస్ వ్యాధితో బాధపడుతూ కొద్దిరోజులు సినిమాలకు సైతం దూరం అయింది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 'క్యూ అండ్ ఎ' సెషన్‌లో భాగంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఈక్రమంలోనే ఓ నెటిజన్ సమంత బరువు గురించి ప్రశ్నించాడు. మళ్లీ బరువు పెరగొచ్చు కదా అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. అయితే ఆ నెటిజన్ చేసిన కామెంట్‌పై సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. 'మళ్ళీ బరువు గురించే ప్రశ్న. నా బరువు గురించి నాకు తెలుసు. ప్రస్తుతం నేను చాలా స్ట్రిక్ట్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్‌లో ఉన్నాను.

అందువల్లే నా బరువు ఇలా ఉంది. నా ఆరోగ్య పరిస్థితుల వల్ల నేను ఇలానే ఉండాలి. ఇతరులను జడ్డ్ చేయడం ఆపండి. వారిని కూడా బతకనివ్వండి. మనం 2024లో ఉన్నాము' అంటూ ఆ నెటిజన్‌కు సమంత కౌంటరిచ్చింది. ఇక ఆరోగ్యం గురించి కోలుకున్న సమంత తిరిగి సినిమాల్లో నటిస్తోంది. ''హనీ, బన్నీ'' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు మరో రెండు సినిమాలకు సమంత ఓకే చెప్పింది.












Click it and Unblock the Notifications