బూతు షోలో మెగా డాటర్ నిహారిక(వీడియో)
మెగా డాటర్ నిహారిక ఇటీవల ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. విడాకులు తీసుకున్న తరువాత మళ్లీ ఇండస్ట్రీలో యాక్టీవ్ అవడానికి ప్రయత్నిస్తోంది. వరుస షోలతో పాటు, పలు సినిమాలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంచు మనోజ్ పక్కన హీరోయిన్‌గా నిహారిక నటిస్తోంది. ''వాట్ ది ఫిష్'' సినిమాలో మంచు మనోజ్ సరసన రొమాన్స్ చేయడానికి నిహారిక రెడీ అవుతోంది. ''వాట్ ది ఫిష్'' ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సినిమాలు చేస్తునే పలు షోలకు నిహారిక తనదైనశైలిలో హోస్ట్‌గా వ్యవహరిస్తోంది.
అయితే నిహారిక చేస్తోన్న ఓ షోపై దారుణంగా విమర్శలు వస్తున్నాయి. నిహారిక ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై "చెఫ్ మంత్ర" కుకరీ అనే షో ఒకటి చేస్తోంది. సినీ సెలబ్రిటీలను "చెఫ్ మంత్ర" కుకరీ షోకు పిలిచి నిహారిక వారిని రోస్ట్ చేస్తోంది. పేరుకి చెఫ్ మంత్ర కానీ ఇందులో చూపించేదంతా కూడా బూతు కంటెంట్‌లాగే కనిపిస్తోంది. దీంతో ఈ షోపై ట్రోలింగ్ ఓ రేంజ్‌లో జరుగుతుంది. దానికి కారణం ఈ షోలో అడిగే ప్రశ్నలే.

డబుల్ మీనింగ్ డైలాగులతో కూడిన ప్రశ్నలు అడగటం ఈ షో యొక్క ప్రత్యేకత. షోకు రేటింగ్ కోసం దారుణమైన కంటెంట్‌ను ప్రేక్షకులకు చూపిస్తున్నారు. 'మీరు డ్యాష్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకుంటారు? మీరు డ్యాష్ చేసి ఎన్ని రోజులవుతుంది..? మీకు ఏ డ్యాష్ అంటే ఇష్టం'' అంటూ పచ్చి బూతులతో కూడిన ప్రశ్నలు అడగటం ఈ షోలో కనిపిస్తోంది. అయితే తరువాత ఈ డ్యాష్‌లకు వేరే అర్థం చెబుతున్నప్పటికీ.. అప్పటికే ఆ ప్రశ్నల ముఖ్య ఉద్దేశం ఏమిటో ప్రేక్షకులకు తెలిసిపోతుంది.
అసహ్యం పుట్టించే బూతులు, అడల్ట్ ప్రశ్నలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం, విడాకులు తీసుకోవడం వంటి వివాదాల్లో చిక్కుకున్న నిహారిక ఇప్పుడు ఈ బూతు షోకు హోస్ట్‌గా వ్యవహారించడంపై మెగా అభిమానులు సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నిహారిక ఇలాంటి షోలలో చేయడం కంటే ఇంట్లో కూర్చోవడం బెటర్ అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications