తండేల్ క్లైమాక్స్‌లో సమంత..?
మూడేళ్లుగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న నాగ చైతన్య ఎట్టకేలకు ఓ హిట్‌ను కొట్టారు.ఆయన తాజాగా నటించిన చిత్రం తండేల్. సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించారు.శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. జాలరి పాత్రలో నాగ చైతన్య కనిపించగా, అతన్ని ప్రేమించే పాత్రలో సాయి పల్లవి నటించారు. గాఢంగా ప్రేమించుకున్న జంట అనూహ్యం ఎడబాటుకు గురి అవుతుంది.
ప్రేమికులు తిరిగి ఎలా కలుసుకున్నారనేది 'తండేల్' కథ.ఈ కథలో దేశభక్తిని కూడా దర్శకుడు జోడించారు. దీంతో సినిమా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు కితాబిస్తున్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి పోటీపడి నటించారు. మొదటి భాగంలో సాయి పల్లవి ఎమోషన్స్ బాగా పండాయి. అదే విధంగా సాయి పల్లవిని డామినేట్ చేస్తూ నాగ చైతన్య నటించారు. చివర 20 నిమిషాలు సినిమా మరో లేవల్లో ఉందని ప్రేక్షకులు అంటున్నారు.

చేపల వేటకు వెళ్లే యువకుడిగా, ప్రేమికుడిగా, జాలరి గ్యాంగ్‌కు లీడర్‌గా, పాకిస్థాన్‌లో దొరికిపోయిన జాలరిగా ఇలా విభిన్న పాత్రల్లో నాగ చైతన్య మెప్పించారు.సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్‌లో నాగ చైతన్య నటన మరో ఎత్తు అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ప్రేమించిన ప్రేయసికి దూరం అయ్యే సమయంలో చైతు నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయితే దీనిపై నెటిజన్లు వేరే రకంగా రియాక్ట్ అవుతున్నారు.
ఆ సమయంలో నాగ చైతన్యకు సమంత గుర్తుకు వచ్చి ఉంటుందని, అందుకే అంతలా యాక్ట్ చేశాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సమంత వల్లే క్లైమాక్స్‌లో అంత అద్భుతంగా నాగ చైతన్య నటించగలిగాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కలెక్షన్లలో కూడా 'తండేల్' సత్తా చాటింది. 'తండేల్' సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 21.27 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా తండేల్ నిలిచింది.












Click it and Unblock the Notifications