ఇక ఈ సినిమా హిట్ అయినట్టే..!

సినిమా వాళ్లకు లోకతత్వం ఉండాలి. లోపల ఏమున్నా.. పైకి అంతా బాగానే ఉందని నటించాలి. హీరోలు సైతం ఇదే సూత్రాన్ని పాటించాలి. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా హవాలో నెగిటివిటీ కాస్తా ఎక్కువగానే ఉంటుంది. పవన్ కల్యాణ్ వంటి స్టార్ హీరో సినిమాకే తొలి రోజు విపరీతమైన బ్యాడ్ టాక్ నడుస్తోంది. ఇక చిన్న హీరోలు , సినిమాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ చిన్న పొరపాటు చేసినా , ఇక ఆ సినిమాను ఎవరూ కాపాడలేరు.

తాజాగా ఇదే పొరపాటు చేశారు నిర్మాత బన్నీ వాసు. ఆయన తాజాగా నిర్మించిన చిత్రం...'మిత్రమండలి'. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. తనను పడగొట్టాలని చూసే ప్రయత్నాలను అదంతా నా వెంట్రుకతో సమానం అంటూ కొట్టిపారేశారు. ట్రోలర్స్‌కు సంచలన సలహా ఇస్తూ, ట్రోల్ చేయడానికి కొంచెం డబ్బులు ఎక్కువ తీసుకోండి. పొగడటానికి తక్కువ తీసుకోండి గాని, అవతలవాడిని తిట్టడానికి మాత్రం ఎక్కువ తీసుకోవాలి అని చురకలు అంటించారు.

Netizens Slam Bunny Vasu s Comments Recall Ram Charan s Past Remarks

నేను ఎప్పటికీ పరిగెడుతూనే ఉంటాను. మీ గురించి ఆలోచించే అంత లో ఆటిట్యూడ్ నాది కాదు అని గట్టిగా చెప్పిన బన్నీ వాసు, ఇండస్ట్రీలో కలిసి ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. సినిమాపై నెగిటివ్ ప్రొపగాండా చేసేవారికి పైన ఆ దేవుడు ఉన్నాడు, చూసే ప్రేక్షకులు ఉన్నారని గట్టి హెచ్చరిక జారీ చేశారు. అయితే బన్నీ వాసు చేసిన కామెంట్స్‌పై నెటజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ఆ తర్వాత తన తప్పును తెలుసుకుని పద్దతి మార్చుకుని మంచిగా మాట్లాడుతున్నారని గుర్తు చేస్తున్నారు. నేటి సమాజంలో ట్రోల్స్ కామన్ అని, అలాంటివి పట్టించుకోకూడదని, అలాంటివి పట్టించుకునే లెక్క అయితే, సినీ ఇండస్ట్రీలో రాణించలేరని, ప్రతి చొట విమర్శించే వారు ఉంటారని గుర్తు చేస్తున్నారు. బన్నీ వాసు చేసిన ఈ కామెంట్స్ సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+