'విశ్వంభర' ఆ సినిమాకు గట్టి పోటీని ఇచ్చేలా ఉందే..!

మెగా అభిమానులకు దసరా పండుగ నాడు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. చిరంజీవి తాజాగా నటిస్తున్న 'విశ్వంభర' టీజర్ పండుగ సందర్భంగా శనివారం విడుదల చేశారు. 1.33 నిమిషాల నిడివి గల ఈ టీజర్ ప్రేక్షకులను కట్టిపడేసింది.విశ్వం యొక్క ఆధ్యాత్మిక రహస్యం.. అంటూ మొదలైన టీజర్‌లో సరికొత్త ప్రపంచాన్ని చూపించే ప్రయత్నం చేశారు. అందులో డైనోసార్ లాంటి జంతువులు కూడా కనిపిస్తున్నాయి. దుష్టశక్తి కూడా ఆ క్రమంలో తన ఆధిపత్యాన్ని చూపిస్తుందని హైలెట్ చేశారు.

విశ్వాన్ని అలుముకున్న ఈ చీకటి విస్తరిస్తున్నంత మాత్రానా వెలుగు రాదని కాదు, ప్రశ్నలు పుట్టించిన కాలమే.. సమాధానాన్ని కూడా సృష్టిస్తుంది. విర్రవీగుగుతున్న ఈ ఆరాచకానికి.. ముగింపు పలికే మహా యుద్ధాన్ని తీసుకు వస్తుంది.. అంటూ టీజర్‌లో చిరంజీవి గుర్రంపై ఎంట్రీ ఇచ్చే సీన్ అదిరిపోయింది. మెగా అభిమానులు టీజర్ సూపర్ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. సోషియో-ఫాంటసీ ఎంటర్‌టైనర్‌‌గా 'విశ్వంభర' తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ త్రిష, యంగ్ బ్యూటీ అశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి, సురభి, ఇషా చావ్లా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Netizens trolled Chiranjeevi movie Vishwambhara badly

ఈ సినిమా షూటింగ్ 90 శాతానికి పైగా పూర్తైంది. అయితే ఈ సినిమాను తొలుత సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమాను వాయిదా వేసినట్టు తెలిపారు. దీంతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న 'గేమ్ ఛేంజర్' కూడా సంక్రాంతికి విడుదల కానుండటంతోనే 'విశ్వంభర' మేకర్స్ సినిమాను వాయిదా వేసినట్టు ప్రకటించారు. అయితే టీజర్‌పై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. సినిమా మెయిన్ పాయింట్ బాగున్నప్పటికీ గ్రాఫిక్స్ బాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

గ్రాఫిక్స్ నాశిరకంగా ఉన్నాయంటూ మెజార్టీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా చిరంజీవి గుర్రం మీద వచ్చే సీన్ అయితే అసలేం బాలేదని , ఇలాంటి సీన్లు బాలయ్య 1990ల్లోనే చేశారంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. బాలకృష్ణ నటించిన 'భైరవదీపం' సినిమాలో ఆయన గుర్రం మీద వచ్చే సీన్‌ను తన ట్వీట్‌కు జత చేశాడు ఓ నెటిజన్. చిరంజీవి గుర్రం మీద వచ్చే సీన్‌కు ముందు ఉన్న కొండలు 'అవతార్' సినిమా నుంచి కాపీ చేసినట్టు ఉందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

సారీ బాస్ ఇది పోయినట్టే అని మరో నెటిజన్ పోస్ట్ పెట్టాడు. మరో నెటిజన్ ఓ అడుగు ముందుకేసి మంచు విష్ణు నటిస్తూ, నిర్మిస్తోన్న కన్నప్ప సినిమాతో ఈ సినిమాను పోల్చారు. 'విశ్వంభర' కన్నప్పకు గట్టిపోటినిచ్చేలా ఉందంటూ ఆ నెటిజన్ ట్వీట్ చేశాడు. గ్రాఫిక్స్ బాలేదని మెజార్టీ అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. మరి సినిమా విడుదల సమయానికి చిత్ర యూనిట్ ఈ గ్రాఫిక్స్‌ను సరి చేసుకుంటారేమో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+