ప్రెగ్నెంట్ అని చూడకుండా దీపికా పదుకొనేను అక్కడ పట్టుకున్నాడేంటి
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ హీరోయిన్ దీపికా పదుకొనే ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. కొంతకాలం డేటింగ్‌లో వీరిద్దరు ఆ తర్వాత తమ బంధాన్ని పెళ్లి వరకు తీసుకువెళ్లారు. బాలీవుడ్‌లో బెస్ట్ పెయిర్ అంటే అందరు వీరిద్దర్నినే చూపిస్తుంటారు. ఆ మధ్య ఈ జంట విడాకులు తీసుకుంటున్నారనే పుకార్లు షికార్లు చేశాయి. రణ్‌వీర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలను డిలీట్ చేశాడు.
దీంతో ఈ జంట విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతున్నారనే ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. అయితే దీపికతో కలిసి ఉన్న ఫొటోలు ఉన్నప్పటికీ పెళ్లి ఫొటోలు అలాగే ఉంచడం అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. వీరిద్దరు మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకోబోతున్నారా? చర్చ మొదలైంది. ఈ పుకార్లకు చెక్ పెడుతూ అభిమానులకు ఈ జంట శుభవార్త అందించారు.

దీపికా పదుకొనే తాను ప్రెగ్నెంట్ అయ్యానని త్వరలోనే మా కుటుంబంలో మరో వ్యక్తి చేరబోతున్నారంటూ తీపి కబురు చెప్పింది. ఇక దీపికా పదుకొనే నటించిన కల్కి సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. గర్భవతిగానే ఈ సినిమా ప్రమోషన్స్‌లో దీపికా పదుకొనే పాల్గొంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగానే వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే రణ్‌వీర్ సింగ్ -దీపికా పదుకొనే అంబానీ ఇంట జరిగిన అనంత్ - రాధికా మర్చంట్ సంగీత్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలతో ఈ జంట ఫొటోలు దిగారు.ఈ క్రమంలో భర్త రణ్ వీర్ సింగ్, బాలీవుడ్ స్టార్స్ ఫ్రెండ్ ఒర్రితో కలిసి పిక్ తీసుకుంది.దీపిక, రణ్ వీర్ మధ్య నిలుచున్నాడు ఒర్రి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా...దీపికా పదుకొనే గర్భంపై ఒర్రి చేయి వేయడాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
దీనిపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కట్టుకున్న మొగుడులా అక్కడ చేయి వేశాడేంటని ఒక నెటిజన్ ప్రశ్నిస్తుంటే..అసలు దీపికా ఎలా పర్మిషన్ ఇచ్చిందని మరో నెటిజన్ ప్రశ్నించాడు. ఇలాంటివి చూస్తూ రణ్ వీర్ మాత్రం ఎలా సహిస్తున్నాడని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ ఫొటోపై నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. దీనిపై రణ్‌వీర్ సింగ్ -దీపికా పదుకొనే జంట ఎలా స్పందిస్తారో చూడాలి.












Click it and Unblock the Notifications