OTTలో విడుదలైన కొత్త సినిమాలు, సిరీస్ లు ఇవే

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ప్రేమలు సినిమా
మలయాళంలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఏకంగా రూ. 100 కోట్ల వసూళు చేసింది. తెలుగులో విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, మళయాళం.. రెండు భాషల్లో అందుబాటులో ఉంది.

లూటేరే- వెబ్ సిరీస్
ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మూడు ఎపిసోడ్లు అందుబాటులో ఉన్నాయి.

new movies and videos release in ott

ట్రూ లవర్- సినిమా
మాస్ మూవీ బ్యానర్ లో దర్శకుడు మారుతి, నిర్మాత SKN కలిసి ఈ సినిమాను తెలుగులోకి తెచ్చారు. తమిళంలో మంచి విజయాన్ని అందుకుంది. మణికందన్, గౌరీప్రియ హీరో హీరోయిన్లుగా నటించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

పట్నా శుక్లా- సినిమా
బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ ప్రధాన పాత్రలో నటించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. బీహార్ లో ఓ ఎడ్యుకేషన్ స్కామ్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది.

ఇన్‌స్పెక్టర్ రిషి- వెబ్ సిరీస్
నవీన్ చంద్ర ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ఇది. నందిని జె.ఎస్ దర్శకత్వం వహించారు. సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు. సుఖ్ దేవ్ లాహిరి నిర్మించారు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్ లో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో నడుస్తోంది. ప్రతి శని, ఆదివారాల్లో కొత్త ఎపిసోడ్లు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. బుల్లితెర కమెడియన్ కపిల్ శర్మ షో ఇది.

సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథి పాత్రలో నటించిన సినిమా'లాల్ సలామ్'. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించారు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

పాల్ గియామట్టి, డావిన్ జాయ్ రాండోల్ఫ్, డొమినిక్ సెస్సా ప్రధాన పాత్రలు పోషించిన హాలీవుడ్ మూవీ 'ది హోల్డోవర్స్'. బుక్‌ మైషో లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+