'ఐ బొమ్మ' సైట్ లో ఓటీటీలతోపాటు కొత్త ఆప్షన్లు
'ఐ బొమ్మ' గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. సినిమాకు వెళ్లి కొంతసేపు ప్రశాంతంగా సేదదీరుదామంటే ఆ అవకాశం లేకుండా చేస్తున్నాయి భారీగా పెరిగిన టికెట్ ధరలు. దీంతో ప్రజలంతా థర్డ్ పార్టీ వెబ్ సైట్లవైపు ఆకర్షితులవుతున్నారు. పైరసీ సినిమాలు చూడటం నేరమైనప్పటికీ ఆ సినిమాలు సామాన్యులకు అందుబాటులో లేకుండా చేసినవారికి అది నేరమని చెప్పే హక్కులేదు. మొబైల్ ఫోన్లలో తీసిన నాణ్యత లేని సినిమాలను ఈ సైట్ అప్ లోడ్ చేయదు. ఓటీటీలో విడుదలైన రోజు అదే మాస్టర్ ప్రింట్ ను అప్ లోడ్ చేస్తుంది. దీంతో సినీ ప్రియులంతా 'ఐ బొమ్మ'కు ఆకర్షితులవుతున్నారు.
నెట్ ఫ్లిక్స్, అమెజాన్
తాజాగా ఈ సైట్ లో మార్పులు చోటుచేసుకున్నాయి. వెబ్ సైట్ లో కొత్తగా అనేక పేజీలు వచ్చాయి. పేరును బప్పంటీవీగా మార్చిన సంగతి తెలిసిందే. గతంలో కేవలం తెలుగు భాషకే ఐబొమ్మ పరిమితమయ్యేది. ప్రస్తుతం మాత్రం తమిళం, కన్నడం, మళయాళ భాషలకు చెందిన సినిమాలను కూడా అందుబాటులోకి తెచ్చింది. సైట్ లో భాషను ఎంపిక చేసుకున్నప్పుడు మరో రెండు కేటగిరీలను, ఓటీటీలతోపాటు ఐబొమ్మ వన్ అనే ఆప్షన్ కూడా అందిస్తోంది.

పలు సబ్ డొమైన్స్ ను అందుబాటులోకి తెచ్చింది. సినిమాలు, వెబ్ సిరీస్ లు డౌన్ లోడ్ చేసుకునే ఆప్షన్ మార్చింది. ఇది చాలా సులువుగా ఉండటంతో ఎలాంటి లింక్ పేజ్ లు లేకుండా ఈజీగా సినిమా డౌన్ లోడ్ అవుతోంది. ప్రీమియం ఓటీటీలకు సంబంధించిన సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా అందిస్తోంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో వస్తున్న అన్ని సినిమాలను ఉచితంగా అందిస్తోంది.
తమిళ్ రాకర్స్ అడ్మిన్ అరెస్ట్
ఐబొమ్మ, మూవీరూల్స్ తోపాటు తమిళ్ రాకర్స్ కూడా సినిమాలను అందిస్తోంది. అయితే నాలుగు రోజుల క్రితమే తమిళ రాకర్స్ కు చెందిన అడ్మిన్ ను తమిళనాడు పోలీసులు కేరళలో అరెస్ట్ చేశారు. మొబైల్ ఫోన్లలో తీసిని సినిమాను అప్ లోడ్ చేస్తుండగా పట్టుకొని తమిళనాడుకు తరలించారు. ఆ సైట్ పై చర్యలు తీసుకోవాలంటూ అక్కడి దర్శక, నిర్మాతలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో చర్యలు తీసుకున్నారు.
-
నయా రికార్డ్ సాధించిన తెలుగింటి కోడలు.. ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ !! -
నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. డకాయిట్ కొట్టేలా ఉన్నాడు! -
టాలీవుడ్ రారాజు "రెబల్ స్టార్" ఆస్తి ఎంతో తెలిస్తే కళ్లు తిరగడం పక్కా !! -
రణ్బీర్ - సాయి పల్లవి "రామాయణ" టీజర్లో ఈ తప్పులను గమనించారా? -
అడవి శేష్ 'డెకాయిట్' మూవీ సెన్సార్ టాక్ ఇదే..! -
టాలీవుడ్లో మళ్లీ 'క్యాస్టింగ్ కౌచ్' కలకలం.. రంగంలోకి పూనమ్ కౌర్! -
నా భర్త 9 మందితో.. సంచలన విషయాలు బయట పెట్టిన తెలుగు హీరోయిన్..! -
అన్నదమ్ముల డబుల్ బొనాంజా.. మొన్న సంతోష్.. ఇప్పుడు సంగీత్ !! -
పెళ్లయ్యాక తొలి బర్త్డే.. పుట్టినరోజున రష్మిక అదిరిపోయే గిఫ్ట్! -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
విడాకులు తీసుకుంటున్న శర్వానంద్?.. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు డిలిట్ -
Don’t Sleep: తెలుగులో తొలి సైకలాజికల్ గ్రిప్పింగ్ థ్రిల్లర్- ఫస్ట్ లుక్












Click it and Unblock the Notifications