హీరో శివాజీ కామెంట్స్ పై నిధి అగర్వాల్ సంచలన పోస్ట్..!
'దండోరా' సినిమా ప్రీ- రిలీజ్ ఈవెంట్స్ లో హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే హీరో శివాజీ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ తన అధికారిక ఇన్ స్టా ఖాతాలో కీలక పోస్టు పెట్టారు. లులు మాల్ ఈవెంట్ లో దిగిన ఫోటోను స్టోరీగా పెట్టారు.
బాధితురాలిని నిందిస్తూ సానుభూతి పొందడం సరికాదు అని క్యాప్షన్ ఇచ్చారు. అయితే నటుడు శివాజీని ఉద్దేశించే నిధి అగర్వాల్ ఈ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది. నిధి డ్రెస్ జారిపోతే పరిస్థితి ఎలా ఉండేదని.. ఆమె పడిన ఇబ్బంది తనను ప్రొవోక్ చేయడం వల్లే దుస్తులపై కామెంట్స్ చేశానని హీరో శివాజీ తెలిపారు. అయితే శివాజీ వ్యాఖ్యలపై మంచు మనోజ్, మంచు లక్ష్మి, చిన్మయి, యాంకర్ అనసూయ తదితరులు స్పందించారు. శివాజీ చేసిన వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు.
ఇక దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాను చేసిన వ్యాఖ్యలపై శివాజీ మీడియాకు వివరణ ఇచ్చారు. ఆవేశంలో రెండు పదాలు నోరు జారాను.. ఆడబిడ్డలకు క్షమాపణలు.. నా స్టేట్ మెంట్ కు కట్టుబడి ఉన్నా. అని తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన యాంకర్ అనసూయపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇష్యూకు సంబంధం లేని వారు రియాక్ట్ అయ్యారని అన్నారు.. అనసూయ గారు మీరు ఎందుకు దీంట్లోకి వచ్చారు..? అని శివాజీ ప్రశ్నించారు.

మరోవైపు శివాజీ వ్యాఖ్యలపై తెలుగు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ స్పందించారు. మా డ్రెస్సుల పై మాట్లాడే హక్కు శివాజీకి ఎవరు ఇచ్చారని పాయల్ అన్నారు. మహిళల డ్రెస్సింగ్ ఎలా ఉండాలని చెప్పే అధికారం మీకు లేదని తెలిపారు. బహిరంగ వేదికపై మహిళల గురించి శివాజీ మాట్లాడటం దారుణమని అన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications