నీ అందం కోసమైనా 'హరిహర వీరమల్లు' చూడాల్సిందే..!
నిధి అగర్వాల్..తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన నిధి అగర్వాల్, ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తన గ్లామర్, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తార నిధి అగర్వాల్. బాలీవుడ్‌లో 'మున్నా మైఖేల్' సినిమాతో అరంగేట్రం చేసింది. బాలీవుడ్‌లో అడుగుపెట్టి, తెలుగు, తమిళ చిత్రాలలో తనదైన ముద్ర వేసి, యువతరాన్ని ఆకట్టుకుంటుంది.
తన అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. 'సవ్యసాచి'తో తెలుగు తెరకు పరిచయమై, 'మిస్టర్ మజ్ను', 'ఇస్మార్ట్ శంకర్' వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే అమ్మడు కెరీర్‌లో ఇప్పటి వరకు సరైన హిట్ మాత్రం లేదు. స్టార్ హీరోలతో నటించినప్పటికీ ఆమె జాతకం మాత్ర మారలేదు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమా నిధి కెరీర్‌కు పెద్ద బూస్ట్ ఇచ్చింది.

అందులో ఆమె పాత్ర, గ్లామరస్ లుక్ యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయినప్పటికీ ఆమె అనుకున్నంత స్థాయిలో ఆఫర్లు మాత్రం దక్కలేదు.ప్రస్తుతం నిధి అగర్వాల్ కెరీర్‌లో ఒక కీలక దశలో ఉంది. ఆమె నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'హరిహర వీరమల్లు'. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో నిధి అగర్వాల్ పాత్ర చాలా కీలకమని, ఆమె నటనకు మంచి స్కోప్ ఉంటుందని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సరసన నటించడం, పైగా చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలో భాగం కావడం నిధి కెరీర్‌కు ఖచ్చితంగా ఒక కొత్త మలుపు అవుతుంది.'హరిహర వీరమల్లు' సినిమా విజయం నిధి అగర్వాల్‌ను స్టార్ హీరోయిన్‌ల సరసన నిలబెట్టే అవకాశం ఉంది. ఈ సినిమాతో ఆమె నటనలోని మరో కోణం ప్రేక్షకులకు పరిచయం అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
The ravishing @AgerwalNidhhi sets the timeline on 🔥 as she dives into a packed day of promotions ❤️#HariHaraVeeraMallu#HHVMonJuly24th #HHVM
— Hari Hara Veera Mallu (@HHVMFilm) July 17, 2025
Powerstar @PawanKalyan @AMRathnamOfl @thedeol #SatyaRaj @amjothikrishna @mmkeeravaani @ADayakarRao2 @Manojdft @Cinemainmygenes… pic.twitter.com/7aQWxzdGyV
ఈ సినిమా తర్వాత నిధి అగర్వాల్ మరిన్ని బడా ప్రాజెక్టుల్లో భాగం కావడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న నిధి లుక్స్ నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. నిధి అందాలపై నెటజన్లు తమదైనశైలిలో కామెంట్స్ చేస్తున్నారు. అందాలు మొత్తం నిధిలా పెట్టుకుందని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, నీ అందాన్ని చూడటానికైనా 'హరిహర వీరమల్లు' చూడాలంటూ రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం నిధి అగర్వాల్ గ్లామరెస్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications