అతనితో డేట్‌కు వెళ్లిన నిహారిక ..ముద్దులు పెట్టిన వీడియో వైరల్
మెగా డాటర్ నిహారిక ఇటీవల ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. విడాకులు తీసుకున్న తరువాత మళ్లీ ఇండస్ట్రీలో యాక్టీవ్ అవడానికి ప్రయత్నిస్తోంది. నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. చైతన్య అనే వ్యక్తిని ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. అయితే భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లైన సంవత్సరానికి భర్తకు విడాకులిచ్చి షాకిచ్చింది.
విడాకుల అనంతరం కొంతకాలం సెలైంట్ అయిన నిహారిక ..ఇటీవల సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్‌గా కనిపిస్తుంది. పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తూనే.. సొంత బ్యానర్‌లో సినిమాలను కూడా నిర్మిస్తోంది. ..మంచు మనోజ్ పక్కన హీరోయిన్‌గా నటించేందుకు మెగా డాటర్ నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనోజ్ నటించే ''వాట్ ది ఫిష్'' అనే సినిమాలో నిహారిక హీరోయిన్‌గా ఎంపికైంది. ఇదిలా ఉంటే నిహారిక తాజాగా తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.

పవన్ బాబాయ్ జనసేన పార్టీ కోసం కష్టపడ్డ తండ్రి నాగబాబును మినీ డేట్‌కు తీసుకువెళ్లింది నిహారిక. ఈ విషయాన్ని తెలుపుతూ.. ఓ క్యూట్ వీడియోను విడుదల చేసింది. తండ్రికి ముద్దులు పెడుతూ తన ప్రేమను చూపించింది. అయితే నిహారికకు నాగబాబు అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ వీడియోను షేర్ చేస్తూ మరోసారి తన ప్రేమను వ్యక్త పరిచింది. ఇక అది చూసిన నెటిజన్లు తండ్రి, కూతురు ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications