మెగా డాటర్ నిహారిక వీడియో వైరల్.. విశ్వక్ సేన్‌తో కలిసి !
మెగా ఫ్యామిలీ నుంచి సినీ రంగంలో అడుగుపెట్టింది " నిహారిక కొణిదెల ". నాగబాబు కుమార్తెగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం నిహారిక మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆమె హీరో విశ్వక్ సేన్‌తో కలిసి కనిపించిన ఓ పాత వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఒక గోడ పక్కన నిలబడి ఉన్న ఇద్దరూ సిగ్గుపడుతూ ముచ్చటగా నవ్వుకుంటూ ఉన్నారు. దీంతో వీళ్ళిద్దరూ ఎప్పుడూ కలిశారు అంటూ జోరుగా చర్చ నడుస్తోంది.
నిహారిక కెరీర్..
షార్ట్ ఫిల్మ్స్‌తో తన టాలెంట్‌ను నిరూపించింది. "ముద్దపప్పు అవకాయ" సహా పలు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది. ఆ తర్వాత బుల్లితెరపై సైతం యాంకర్ గా సత్తా చాటింది. ఈ గుర్తింపుతోనే నాగశౌర్యతో కలిసి "ఒక మనసు" చిత్రంలో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా.. విమర్శకుల ప్రశంసలు పొందగలిగింది. ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.

నటన నుంచి నిర్మాతగా ప్రయాణం..
హీరోయిన్ గా ఆశించినంత ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోవడంతో.. నిర్మాతగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. "పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్" అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. వెబ్ సిరీస్‌లు, చిత్రాలను నిర్మించడం ప్రారంభించింది. "డెడ్ లైన్", "కమిటీ కుర్రోళ్లు" వంటి విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించి, కంటెంట్‌కి ప్రాధాన్యతనిచ్చే నిర్మాతగా నిలిచింది. "కమిటీ కుర్రోళ్లు" బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో పాటు.. ఆమెకు "బెస్ట్ ప్రొడ్యూసర్" అవార్డు కూడా దక్కింది.
వైరల్ వీడియో..
అయితే నిహారిక - విశ్వక్ సేన్ మధ్య బంధం విషయానికి వస్తే కాలేజీలో చదువుకునేటప్పుడు నిహారిక విశ్వక్ సేన్ కి సీనియర్ అట. ఈ విషయాన్ని ఒక సినిమా ఈవెంట్ లో కూడా తెలియజేసింది. ఆ క్రమంలోనే వారిద్దరూ 2013 లో టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే శరత్ ఫిల్స్ లో కలిసి నటించినట్టు తెలుస్తోంది.
మరోవైపు నిహారిక తన రెండో సినిమా "ప్రొడక్షన్ నెం.2"పై దృష్టిసారించింది. ఈ చిత్రంలో సంగీత్ శోభన్ హీరోగా నటించగా, దానికి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమై, ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది.












Click it and Unblock the Notifications