మరోసారి ప్రేమలో పడ్డ నిహారిక
మెగా డాటర్ నిహారిక వ్యక్తిగత జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. తొలుత టీవీ షోల్లో హోస్ట్‌గా కనిపించిన నిహారిక తరువాత వెండితెర మీద హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లి పీటలెక్కింది. చైతన్యను ప్రేమించి పెళ్లాడింది.
అయితే మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగానే ట్రోల్ చేశారు. విడాకుల తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. నిహారిక తన విడాకులపై క్లారిటీ ఇచ్చారు.

పెళ్లైనా ఏడాదికే విడాకులు తీసుకుంటానని ఊహించలేదు.దెబ్బ తగిలిన వారికి ఆ నొప్పి ఏంటో తెలుస్తోంది. పెళ్లి, విడాకులు అనేది ఈజీ కాదని.. నా భవిష్యత్తు గురించి ఆలోచించే విడాకులు తీసుకున్నానని నిహారిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నాను. భవిష్యత్తులో రెండో పెళ్లి చేసుకొంటరా అంటే సమాధానం చెప్పలేనని తెలిపింది.

తాజాగా నిహారిక తన సోషల్ మీడియలో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. రెండు ఏనుగులు ముఖాన్ని దగ్గరగా పెట్టుకుని ఓ కపుల్ లవ్‌లో ఉంటే ఎంత ప్రేమగా ఉంటారో అలాంటి ఫొటోను ఒకటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దీనికి రెడ్ హార్ట్ సింబల్‌ను కూడా జత చేసింది. ఇది చూసిన వారంతా నిహారిక మళ్లీ ప్రేమలో పడిందని ..అందుకే ఇలా హింట్ ఇచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నిహారిక చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications