డ్రగ్స్ కేసులో అలా దొరికిపోయాను - మెగా డాటర్
మెగా డాటర్‌గా నిహారికకు మంచి గుర్తింపు ఉన్న సంగతి అందరికి తెలిసిందే. యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన నిహారిక అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత బుల్లితెర మీద నుంచి వెండితెర మీదకు హీరోయిన్‌గా మారింది. ఎందుకో తెలియదు కానీ హీరోయిన్‌గా నిహారిక అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు.
ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో పెళ్లి పీటలెక్కింది. చైతన్యను ప్రేమించి పెళ్లాడిన ఈ మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేక..అతనికి విడాకులిచ్చింది. ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన నిహారిక.. మంచు మనోజ్‌తో ''వాట్ ది ఫిష్'' అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో పాటు పలు షోలకు హోస్ట్‌గా చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.

తాజాగా నిహారిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..డ్రగ్స్ కేసులో అరెస్ట్ గురించి స్పందించింది. రాడిసన్ పబ్‌పై పోలీసులు జరిపిన దాడుల్లో నిహారికను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిహారిక అరెస్ట్‌పై మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి. తాజాగా దీనిపై నిహారిక మాట్లాడుతూ.. నేను పబ్బులకు ఎక్కువుగా వెళ్లను. ఈ విషయం నా ఫ్రెండ్స్ అందరికీ అది తెలుసు. ఆ రోజు మా స్కూల్ ఫ్రెండ్‌ను కలవడానికి మాత్రమే నేను అక్కడికి వెళ్లాను. దాదాపు ఆరు నెలల తరువాత మేమంతా కలిశాము. అది కూడా ఒక ఫ్రెండ్ పిలిస్తేనే అక్కడకు వెళ్లాను.
కాసేపు అక్కడే ఉండి పార్టీ చేసుకుని బిల్ కట్టి బయటకు వస్తోన్నసమయంలోనే పోలీసులు పబ్‌కు వచ్చారు. అందరితోపాటు మమ్మల్ని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. మొదట అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నా తప్పు లేకుండా నన్ను ఎందుకు ఇరికిస్తున్నారో అని బాధపడ్డాను. నా తప్పు లేకుండా నన్ను ఎందుకు ఇరికిస్తున్నారని ప్రశ్నిస్తున్న సమయంలో...ఆ పబ్‌లో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నారని తెలిసిన పోలీసులు పబ్‌పై దాడి చేశారని తెలిసింది. నేను తప్పుడు ప్రదేశంలో ఉన్నాననే విషయాన్ని లేటుగా అర్థం చేసుకున్నానని తెలిపింది. అప్పటినుంచి పబ్‌లకి వెళ్లడమే మానేశానంటూ చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications