శుభవార్త చెప్పిన నిహారిక..చేతికి వెడ్డింగ్ రింగ్..?
మెగా డాటర్ నిహారిక మరోసారి వార్తల్లో నిలిచారు. బుల్లితెరపై కెరీర్ ప్రారంభించిన నిహారిక, ఆ తర్వాత వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పి వివాహం చేసుకుంది.
పెళ్లి పీటలెక్కిన మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న నిహారిక, తిరిగి ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఈసారి నటిగా కాకుండా నిర్మాతగా మారి ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.

తాను నిర్మించిన తొలి సినిమా హిట్ కావడంతో నిహారిక సైతం ఆనందం వ్యక్తం చేశారు. తొలి సినిమాతోనే సక్సెస్ కొట్టిన నిహారిక ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇక ఇదే సమయంలో నిహారిక నిర్మించిన సినిమా పలు అవార్టులను కూడా సొంతం చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం 'కమిటీ కుర్రాళ్లు''సినిమాను గద్దర్ అవార్డుతో సత్కరించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద అవార్డు అందుకుంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్ట్‌ను నిహారిక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
'నేను కారులో ఒంటరిగా ఉన్నంత వరకు అది నాకు గుర్తులేదు - కానీ ఈ అవార్డు 10 సంవత్సరాల క్రితం ఒక చిన్న నిర్మాణ సంస్థను ప్రారంభించిన అమ్మాయికి ప్రపంచం లాంటిది. ఆమె చూసినట్లు అనిపిస్తుంది. ఇది నిజమైన ప్రారంభంలా అనిపిస్తుంది.ప్రేక్షకులకు, నా బృందానికి, ఈ చిత్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ప్రతి ఒక్కరికీ, నా కుటుంబానికి మరియు నా స్నేహితులకు ధన్యవాదాలు' అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.
అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ నిహారిక పోస్ట్ చేసిన ఫొటోలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. నిహారిక చీక కట్టుకుని కనిపించారు. అయితే ఈ సందర్భంగా ఆమె చేతికి కొత్తగా ఉంగరం దర్శనం ఇచ్చింది. నిహారిక కూడా ఆ ఉంగరం హైలెట్ అయ్యేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. దీంతో నిహారిక రెండో పెళ్లికి సిద్ధమైందని, అందుకు సంబంధించినిదే ఆ ఉంగరం అంటూ ప్రచారం జరుగుతోంది. అది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ ఆమెకు కంగ్రాట్స్ తెలుపుతున్నారు. మరి తనపై వస్తోన్న రూమర్స్‌పై నిహరిక ఎలా స్పందిస్తుందో చూడాలి.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
ఓటీటీలోకి తెలుగు కామెడీ మూవీ.. నాన్ స్టాప్ నవ్వుల జాతర షురూ..! -
పెద్ది సినిమాలో పిచ్చెక్కించే ట్విస్ట్ ఇదే.. ఒక్కరు కాదు ఇద్దరు ?? -
దద్దరిల్లిన "BB జోడీ".. గ్రాండ్ ఫినాలేలో పర్ఫామెన్స్ పూనకాలే.. విన్నర్స్ వాళ్లే ?? -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
అన్న హీరో.. చెల్లి నిర్మాత.. "బరి" వీడియో వైరల్ !! -
ఓటీటీలో జనాలు ఎగబడి చూస్తున్న సినిమా ఇదే.. మీరు చూశారా? -
"దానికోసం రోజూ ఫోర్స్ చేయలేను.. అందుకే విడిగా ఉంటున్నాం".. భర్తపై ఓపెన్ అయిన హీరోయిన్ -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
‘ధురంధర్2’ హిట్ అయినా.. రాబోయే బాక్సాఫీస్ తుఫానులన్నీ తెలుగు సినిమాలవే












Click it and Unblock the Notifications