రెండో పెళ్లిపై కోరిక ఉంది ..నా వయస్సు 30 ఏళ్లే
మెగా డాటర్ నిహారిక మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడిన నిహారిక కెరీర్‌తో పాటు తన విడాకులపై కూడా స్పందించారు. ఒక మనస్సు, సూర్యకాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ నిహారికకు తగిన గుర్తింపు రాలేదు. ఆమె కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు.
దీంతో పెళ్లి పీటలెక్కిన మెగా డాటర్ భర్త చైతన్యతో కాపురాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది.అతనితో విడాకులు తీసుకుని మెగా అభిమానులకు గట్టి షాకే ఇచ్చింది. అయితే ఆ సమయంలో నిహారికను నెటిజన్లు ఘోరంగానే ట్రోల్ చేశారు. విడాకుల తీసుకోవడంలో నిహారికదే తప్పని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తనపై వస్తోన్న ప్రచారాన్ని నిహారిక ఎప్పుడు ఖండించింది లేదు.

తాజాగా ఓ యూట్యూబ్‌లో ఛానెల్‌లో మాట్లాడిన నిహారిక తన విడాకులపై క్లారిటీ ఇచ్చారు. పెళ్లైనా ఏడాదికే విడాకులు తీసుకుంటానని ఊహించలేదు.దెబ్బ తగిలిన వారికి ఆ నొప్పి ఏంటో తెలుస్తోంది. పెళ్లి, విడాకులు అనేది ఈజీ కాదని.. నా భవిష్యత్తు గురించి ఆలోచించే విడాకులు తీసుకున్నానని నిహారిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నాను. భవిష్యత్తులో రెండో పెళ్లి చేసుకొంటరా అంటే సమాధానం చెప్పలేను.
అలాగని ఇక్కడే ఆగిపోవాలని కూడా తాను భావించడం లేదు. నా వయస్సు జస్ట్ 30..సో ఏదైనా జరగొచ్చని ఆమె తెలిపింది. నా తల్లిదండ్రులకు భారం కాకూడదనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. దీంతో నిహారిక కచ్చింతంగా రెండో పెళ్లి చేసుకుంటుందని భావిస్తున్నారు. ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు రెండో పెళ్లి చేసుకుని అయినా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications