పెంపుడు కుక్క పుట్టినరోజు వేడుకలు చేసిన నిఖిల్ హీరోయిన్..
సాధారణంగా ఇంట్లో పెంచుకునే కుక్కలను ఇంటి సభ్యులతో సమానంగా చూస్తుంటాం. వాటికి పేర్లు పెట్టడం, పుట్టినరోజు వేడుకలు చేయడం, అలాగే సీమంతం వేడుకలు ఇలాంటి వార్తలు ఈ మధ్యకాలంలో తరచుగా చూస్తునే ఉన్నాం.అయితే తాజాగా నిఖిల్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఐశ్వర్య మీనన్ తన పెంపుడు కుక్క పుట్టినరోజు వేడుకలను ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసింది. ఈ వేడుకల్లో తన స్నేహితులతో కలిసి ఎంతో హాంగామా చేసింది. స్పై సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఐశ్వర్య మీనన్.. ఎప్పుడూ సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు, తాజాగా తన పెంపుడు కుక్క బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌మీడియాలోని తన ఖాతాలో పోస్ట్ చేసింది. ఇప్పడు ఈ ఫొటోలు తెగ వైరల్‌గా మారాయి.
స్పై చిత్రంతో.. టాలీవుడ్‌లో మెరిసింది : స్పై చిత్రంతో హీరో నిఖిల్‌తో జతకట్టింది ఐశ్వర్య మీనన్. ఇందులో ఆమె నటన, యాక్షన్, గ్లామర్ ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఆశించినా ఫలితాలు పొందలేకపోయినా, ఇందులో ఐశ్వర్య మీనన్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. అయితే ఆ తర్వాత తెలుగులో ఎటువంటి సినిమాలు చేయకపోయినా, సోషల్‌మీడియాలో మాత్రం తరచుగా యాక్టివ్‌గానే కనిపిస్తోంది ఈ బ్యూటీ. తాజాగా తన పెంపుడు కుక్క పుట్టినరోజు వేడుకలు చేస్తున్న ఫోటోలు ఇప్పడు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారుతున్నాయి.

కాఫీ మీనన్..బర్త్‌డే సెలబ్రేషన్స్ : ఐశ్వర్య మీనన్ తెలుగు సినిమాతో పాటు తమిళం, కన్నడలో సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె స్పై చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. నిఖిల్ హీరోగా నటించిన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, ఐశ్వర్య మీనన్ అందాలతో, యాక్షన్‌తో ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు మలయాళంలో ఓ సినిమా చేస్తుందీ ఈ బ్యూటీ. అయితే, నటి ఐశ్వర్య మీనన్‌కి ఒక పెంపుడు కుక్క ఉంది. దాని పేరు కాఫీ మీనన్. ఆ కుక్కంటే ఐశ్వర్య మీనన్‌కు ఎంతో ప్రేమ. ఆ కుక్క మీద ప్రేమతో ఎవరూ చేయని విధంగా ఏకంగా తన పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించింది. అయితే అది మామూలు సెలబ్రేషన్ కాదు.
ప్రత్యేకంగా డెకరేట్ చేయించి, ఒక పార్టీని కూడా అరెంజ్ చేసింది ఈ అమ్మడు. ఈ సందర్భంగా తన స్నేహితులను కూడా ఈ పార్టీకి ఆహ్వానించింది. ఈ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంటూ ఓ పోస్ట్‌ను కూడా పెట్టింది. మీరు కుక్కని ప్రేమించకపోతే, మీ హార్ట్ పరిపూర్ణం కాదు. ఈ విషయం ఏ కుక్క యాజమానిని అడిగినా అవుననే సమాధానం చెబుతాడు. అంటూ పోస్ట్ పెట్టింది. అయితే తన డాగ్ బర్త్ డే సందర్భంగా తన ఫ్రెండ్స్‌ను, కుటుంబాన్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అంటుంది ఐశ్వర్య మీనన్. వారంతా వచ్చి కాఫీ మీనన్ బర్త్ డే ఎంతో స్పెషల్‌గా మార్చారని తెలిపింది. ఈ సందర్బంగా దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఇప్పడు ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications