ఈ సినిమా ఏంటి భయ్యా..గుండెల్ని పిండేస్తుంది..!

ప్రేమకథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ, వాలెంటైన్స్ డే కానుకగా విడుదలైన 'నిలవే' చిత్రం బాక్సాఫీస్ వద్ద సైలెంట్ హిట్‌గా నిలిచింది. సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంటగా నటించిన ఈ చిత్రం, అద్భుతమైన మ్యూజికల్ లవ్ డ్రామాగా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ ఘన విజయంపై చిత్ర యూనిట్ మంగళవారం రామానాయుడు స్టూడియోలో గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.

ఈ వేడుకలో ఆస్కార్ గ్రహీత, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ వీడియో సందేశం ద్వారా చిత్ర యూనిట్‌ను అభినందించారు. 'నిలవే' చిత్రం బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ఈ వాలెంటైన్స్ వీక్‌లో విడుదలైన చిత్రాల్లో 'నిలవే' డీసెంట్ కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్ర హీరో హీరోయిన్లు భవిష్యత్తులో సూపర్ స్టార్స్ అవుతారు. చాలా రోజుల తర్వాత ఒక స్వచ్ఛమైన సినిమా చూశాను. ఇది బాపు గారు గీసిన బొమ్మలా, విశ్వనాథ సత్యనారాయణ గారి కవితలా, నేటి జనరేషన్ 'గీతాంజలి'లా ఉంది. మా కరీంనగర్ కుర్రాడు సౌమిత్ ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టడం గర్వంగా ఉందని చంద్రబోస్ అన్నారు.

Nilave Movie Success Meet A Modern-Day Geethanjali Wins Hearts Silent Hit in This Valentine Season

హీరో సౌమిత్ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాం. రాజమౌళి గారికి 'బాహుబలి' ఎంత ప్రత్యేకమో, మాకు మా 'నిలవే' అంత ప్రత్యేకం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాం. థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు చూస్తుంటే మా మూడేళ్ల కష్టం మర్చిపోయాం అని అన్నారు.

ప్యూర్ ఇంటెన్షన్‌తో సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమా నిరూపించింది. కొత్తగా వచ్చే మేకర్స్ సినిమా ఎందుకు తీస్తున్నామో అనే స్పష్టతతో ఉంటే సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది.ప్రీతి పాత్రలో నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన సౌమిత్‌కు, తొలి చిత్రానికే ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు.కొత్త వారైనా అందరూ అద్భుతంగా నటించారు. ఇదొక చక్కటి మ్యూజికల్ లవ్ స్టోరీ. మా సినిమాకు సపోర్ట్ చేసిన సాంకేతిక నిపుణులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. కళ్యాణ్ నాయక్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవగా, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా తమ నటనతో ఆకట్టుకున్నారు. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం, ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+