నీతా అంబానీ మేకప్ ఆర్టిస్ట్ జీతం ఎంతో తెలుసా?
రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఏది చేసినా సంచలనంగానే ఉంటుంది. ఆయన భార్య నీతా అంబానీ 59 సంవత్సరాల వయసులోను ఎంతో అందంగా కనపడతారు. ఆమె అలా కనిపించేలా చేయడంలో మిక్కీ కాంట్రాక్టర్ అనే సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్టు ఉన్నాడు. నీతా అంబానీ కూతురు ఈషా అంబానీ, కోడలు శ్లోక అంబానీకి కూడా మేకప్ సర్వీస్ అందిస్తుంటాడు. మిక్కీ సెలబ్రిటీ కావడంతో అతడు వసూలు చేసే అమౌంట్ కూడా భారీగా ఉంటుంది.
ఒక రోజుకు ఒక వ్యక్తికి మేకప్ చేసినందుకు ఏకంగా రూ.75 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఫీజు తీసుకుంటాడు. ముంబయిలో మేకప్ చేసినందుకు మాత్రమే ఈ ఛార్జి ఉంటుంది. ముంబయి దాటివస్తే ఇంకా ఎక్కువగా ఉంటాయి. సెలబ్రిటీలు మాత్రమే మిక్కీతో మేకప్ వేయించుకుంటారు. ఎందుకంటే అతడి ఛార్జీలను భరించగలిగేది వారే. ఆయన సంపాదన ముందు పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలు కూడా సరిపోరంటారు. దిల్ తో పాగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషి కభీ గమ్, డాన్, గుడ్ న్యూస్, ఇంగ్లీష్ మీడియం వంటి సినిమాలకు కూడా పని చేశాడు.

మిక్కీ జాబితాలో పెద్ద పెద్ద సెలబ్రిటీలుంటారు.కరీనాకపూర్, దీపికా పదుకొనే, ఐశ్వర్యారాయ్, అనుష్క శర్మ లాంటివారంతా మిక్కీచేతే మేకప్ వేయించుకుంటారు. నీతా అంబానీ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న మిక్కీ చార్జ్ వసూలు సెలబ్రిటీల ఆదాయంతో కూడా సరితూగవు అంటరు.
పదిరోజుల క్రితమే ముకేష్ అంబానీ-నీతా అంబానీ తమ కుమారుడు అనంత్ అంబానీ కోడలు రాధిక మర్చంట్ నిశ్చితార్థాన్ని నిర్వహించారు. ప్రీవెడ్డింగ్ పేరుతో జరిగిన ఈ వేడుకకు ప్రపంచంలోని వ్యాపారవేత్తలు, దేశంలోని సెలబ్రిటీలంతా హాజరయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు ముకేష్ రూ.వెయ్యి కోట్లకు పైగా ఖర్చుపెట్టారని వార్తలు వస్తున్నాయి. దేశంలోని వివిధ రంగాల్లో లబ్ధప్రతిష్టులైన సెలబ్రిటీలంతా హాజరయ్యారు. జులైలో వీరి వివాహ వేడుక జరగనుంది.












Click it and Unblock the Notifications