ఆ హీరో, డైరెక్టర్ మస్త్ ట్రై చేశారు.. ఓపెన్ అయిన నిత్యా మీనన్
ప్రముఖ నటి నిత్యామీనన్.. దక్షిణాది భాషల్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కలిపి సుమారు యాభై చిత్రాలకు పైగా నటించింది. మూడు సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు, రెండు నంది అవార్డులు అందుకుంది. నితిన్ తో ఇష్క్, నానితో అలా మొదలైంది చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నిత్యా మీనన్. ఆ తర్వాత గుండె జారి గల్లంతయిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, 100 డేస్ ఆఫ్ లవ్, సన్నాఫ్ సత్యమూర్తి, కాంచన 2, జనతా గ్యారేజీ, గీతా గోవిందం, ఎన్టీఆర్ కథానాయకుడు, భీమ్లా నాయక్.. తదితర చిత్రాల్లో నటించి తన నటనతో మెప్పించింది.
😂 #VijaySethupathi just experienced the shock of a lifetime, and the entire press conference turned into a laugh riot! 😆🤣#NithyaMenon #VijaySethupathi #ThalaivanThalaivii #SirMadam ##ThalaivanThalaiviiReview #ThalaivanThalaiviiReview #SirMadamFromAug01 pic.twitter.com/eXXOynX5SO
— Mix Show (@MixShow1016584) July 30, 2025
అయితే తాజాగా తమిళ హీరో విజయ్ సేతుపతితో సార్ మేడమ్ అనే సినిమా చేసింది. ఈ మూవీ ఆగస్టు 1 న విడుదల కానుంది. ఈ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ వచ్చింది చిత్ర యూనిట్. అక్కడ జరిగిన ప్రెస్ మీట్ లో తన పెళ్లి గురించి మాట్లాడే సమయంలో మాట జారి మళ్లీ క్లారిటీ ఇచ్చింది నిత్యా మీనన్. తెలుగులో మాట్లాడుతూ సరిగ్గా చెప్పే క్రమంలో.. డబుల్ మీనింగ్ వచ్చేలా మాట్లాడేసింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో నిత్యా మీనన్ కు పెళ్లిపై ప్రశ్న అడిగారు. అప్పుడు తనను విజయ్ సేతుపతి, సార్ మేడమ్ మూవీ దర్శకుడు చాలా ట్రై చేశారంటూ వ్యాఖ్యానించింది నిత్యా మీనన్. దీంతో వెంటనే విజయ్ సేతుపతి కలగజేసుకున్నారు. సరిగా చెప్పమ్మ లేదంటే వేరే అర్థాలు వస్తాయని అన్నారు. ఆ తర్వాత నిత్యా క్లారిటీ ఇచ్చింది. దీంతో అక్కడున్న వాళ్లంతా నవ్వుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications