ఆ పార్ట్ కు సర్జరీ చేసుకుంటేనే ఛాన్స్ ఇస్తామన్నారు.. హీరోయిన్ నిత్యా సంచలనం

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్రసీమలో అడుగుపెట్టాలంటే యువ నటీనటులకు సవాల్ తో కూడుకున్న అంశం. అందం, టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో అవకాశం రావాలంటే ఎక్కే గడప దిగే గడపలు ఎన్నో. అలా సినిమా కష్టాలు అనుభవించిన వాళ్లే సినీ పరిశ్రమలో నెట్టుకు రాగలుగుతారు. ఇక హీరోయిన్ అవ్వాలంటే మాత్రం మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

దేవుళ్లు చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు చిత్ర సీమకు పరిచయం అయింది నిత్యా శెట్టి. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత పలు హిట్ మూవీస్ లో నటించి మెప్పించింది ఈ అమ్మడు. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిత్యా శెట్టి కీలక విషయాలు వెల్లడించింది. తాను ఆడిషన్స్ లో పాల్గొన్నప్పుడు ఎదురైన అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది నిత్యా శెట్టి. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

దేవుళ్లు చిత్రంతో తెలుగులోకి ఆరంగేట్రం చేసింది నిత్యా శెట్టి. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో మెరిసింది. పిట్ట కథ సినిమాలో హీరోయిన్ గానూ నటించింది. ఈ సినిమా కోసం ఏకంగా 20 కేజీలు బరువు తగ్గినట్లు ఇంటర్వ్యూలో నిత్యా శెట్టి పేర్కొన్నారు. అంతేకాక మరో సినిమా కోసం ఆడిషన్స్ కు వెళ్తే ముక్కు చిన్నగా ఉందని రిజెక్ట్ చేశారట. ముక్కు చిన్నగా ఉందని సర్జరీ చేసుకుంటేనే సినిమా ఆఫర్ ఇస్తామని దర్శక నిర్మాతలు తనకు చెప్పినట్లు హీరోయిన్ నిత్యా శెట్టి పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Nithya Shetty Opens Up About Harrowing Audition Experiences

నటి నిత్యా శెట్టి దేవుళ్లు చిత్రంతో పాటు అంజి, చిన్ని చిన్ని ఆశ, లిటిల్ హార్ట్స్, మాయ తదితర సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. తలైవీ, మోస్ట్ వాంటెడ్ పండుగాడు చిత్రాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హలో వరల్డ్, 3 సీ అనే వెబ్ సిరీస్ లోనూ నటించింది. అయితే ఈ బ్యూటీ చదువులోనూ టాపర్ గా ఉందంట. బీటెక్‌ ఈసీఈలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఈ బ్యూటీ ఇన్ఫోసిస్ కంపెనీలో చేరి కొన్నేళ్ల పాటు విధులు నిర్వర్తించింది. మధ్యలో ఇస్రో పరీక్షలో ఉత్తీర్ణత సాధించి.. అక్కడ కూడా జాబ్ ఆఫర్ సొంతం చేసుకుంది. కానీ వీటిని వదిలిపెట్టి మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది నిత్యా శెట్టి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+