బాలయ్య రికార్డ్ ను ఏ హీరో బీట్ చేయలేకపోయాడు!
ఆరోగ్యాన్ని జాగ్రత్తగా రక్షించుకుంటూ, మనసుకు నచ్చిన పని చేసుకుంటూ జీవితంలో ముందుకు వెళుతుండాలి. అంతేకానీ 60 ఏళ్లు వచ్చాయి.. నీకు వయసైపోయింది.. ఇంక మూలన కూర్చో అనేమాటలు గతంలో వినపడేవికానీ ప్రస్తుతం వినపడటంలేదు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నందమూరి బాలకృష్ణ కోసం. వయసుతో సంబంధం లేకుండా పనిచేసుకుంటూ పోతుండాలనే విషయాన్ని ఆయన్ని చూసి నేర్చుకోవాలంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు.
వయసు పెరుగుతున్న కొద్దీ అందాన్ని, నటనను బాలయ్య పెంచుకుంటూ వెళుతున్నారు. రోజురోజుకు కుర్రాడిలా మారిపోతున్నారు. బాలకృష్ణ కెరీర్ అయిపోయింది.. ఆయనకు హిట్లు రావు.. పక్కకు తప్పుకోవడమే మంచిది అనుకుంటున్న తరుణంలో అఖండ సినిమాతో సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు. బాలయ్య నట విశ్వరూపంతో పాటు అఘోరా పాత్ర చూసిన తెలుగు సినీ జనాలు వహ్వా అన్నారు.

బుల్లితెరపై అన్‌స్టాపబుల్ టాక్ షోను ఒంటిచేత్తో బ్లాక్ బస్టర్ హిట్ చేశారు. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై తనకు సాటి వచ్చే టాలీవుడ్ సెలబ్రిటీ ఎవరూ లేరు అని ఈ షోద్వారా మరోసారి నిరూపించారు. ఆయన ఆటిట్యూడ్ లో సాటివచ్చే తెలుగు హీరో లేడు. అసలు అలుపు లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అఖండ తర్వాత సంక్రాంతికి వీరసింహారెడ్డి, దసరాకు భగవంత్ కేసరితో హ్యాట్రిక్ హిట్లు కొట్టారు.
వీరసింహారెడ్డి సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.54 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టి తన స్టామినా ఎలాంటిదో చూపించారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. ఈ సినిమా ద్వారా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని నందమూరి అభిమానులు సంబరంగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications