నాతో ఒక్క సినిమా తీయండి ప్లీజ్..ఆ దర్శకుడుని వేడుకున్న ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంట్ గురించి కొత్తగా పరిచియం చేయాల్సిన పనిలేదు. మాస్ డైలాగులు చెప్పడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ఇక డ్యాన్స్‌ల్లో కూడా ఎన్టీఆర్ అదరగోడుతుంటారు. ఎంతో కష్టమైన స్టెప్స్‌ను సైతం ఎన్టీఆర్ చాలా ఈజీగా చేస్తుంటారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇటీవలే ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి కామెంట్స్ చేశారు. ఎటువంటి ప్రాక్టిస్ లేకుండానే ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తుంటారని ఆమె చెప్పడం జరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోతుంది. ఎన్టీఆర్ సైతం జాతీయ స్థాయిలో తన సినిమాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఈక్రమంలోనే ఎన్టీఆర్ తాజాగా నటించిన చిత్రం దేవర, ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. అందుకే హిందీలోనే అధికంగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఇంటర్వ్యూ, కపిల్ శర్మ షోలో ఎన్టీఆర్ సందడి చేశారు. తాజాగా తమిళనాడులో సైతం ఎన్టీఆర్ ప్రమోషన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తమిళ దర్శకుల్లో తనకు వెట్రిమారన్ అంటే చాలా ఇష్టమని ఎన్టీఆర్ తెలిపారు. ఆయనతో సినిమా చేయాలని ఉందని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. కావాలంటే తమిళంలోనే సినిమా తీద్దామని, దాన్ని తెలుగులోకి డబ్ చేద్దామని తమిళ దర్శకుడు వెట్రిమారన్‌కు ఎన్టీఆర్ ఆఫర్ కూడా ఇచ్చారు.

NTR comments on film with Tamil director Vetrimaaran

అయితే వీరిద్దరు గతంలోనే ఓ సినిమా చేద్దామని ప్రయత్నించారు. హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంలో వెట్రిమారన్ మాట్లాడుతూ..ఎన్టీఆర్ మీట్ అయి కథ కూడా చెప్పాను. అది చేయాల్సి ఉంది. కానీ నేను టైమ్ తీసుకున్నాను. నేను అప్పటికే ఒక సినిమా షూటింగ్ లో ఉన్నా.. మళ్ళీ వెంటనే ఆ మూవీ అంటే కొంత టైం పడుతుందని అందుకే ఆగానని తెలిపారు. ఇద్దరూ బిజీగా ఉండటంతో వీరి కాంబినేషన్‌లో తీయాల్సిన సినిమా వాయిదా పడింది. ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ తర్వాతైనా వెట్రిమారన్ ఆయనతో సినిమా చేస్తారో లేదో చూడాలి. ఇక ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవర సినిమా సెప్టెంబర్‌ 27న విడుదల కానుంది. ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఈ సినిమాతో జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచియమవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+