బాహుబలి-2 రికార్డును బద్దలు కొట్టిన దేవర
'అరవింద సమేత' తర్వాత ఎన్టీఆర్ సింగిల్ హీరోగా నటించిన చిత్రం 'దేవర'. మధ్యలో 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటించినప్పటికీ, ఈ సినిమాలో రామ్ చరణ్ మరో హీరోగా నటించాడు. దీంతో దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సింగిల్‌గా నటించిన చిత్రం 'దేవర' ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆరేళ్ల తర్వాత యంగ్ టైగర్ సింగిల్ హీరోగా కనిపించడంతో నందమూరి అభిమానులు పండుగ చేసుకున్నారు. 'దేవర' సినిమాలోని మొదటి పార్ట్ గత నెల 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజు డివైట్ టాక్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత సూపర్ హిట్ దిశగా 'దేవర' దూసుకుపోయింది.
బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 'దేవర' భారీ వసూళ్లను సాధిస్తోంది. సినిమా మొదటి రోజునే వరల్డ్ వైడ్‌గా రూ. 172 కోట్లు సాధించి చరిత్ర సృష్టించింది. మూడు రోజులు కలిపి ఈ సినిమా రూ.304 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. తాజాగా ఈ సినిమా రూ.500 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫిషియల్‌గా ప్రకటించింది. ఎన్టీఆర్ సోలో హీరోగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'దేవర' నిలవడంతో పాటు, ఓవర్సీస్‌తో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో ఎన్టీఆర్ సత్తా ఏంటో నిరూపించింది.

ఓవర్సీస్‌లో ఈ సినిమా 6 మిలియన్ల డాలర్లను కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డును బ్రేక్ చేసింది. దర్శకధీరుడు, ప్రభాస్ కాంబినేషన్‌లో వచ్చిన బాహుబలి-2 రికార్డును ఎన్టీఆర్ 'దేవర' బ్రేక్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 'బాహుబలి -2' సినిమా 16 రోజున నాడు రూ.3.50 కోట్లు సాధించింది. ఇప్పటి వరకు అదే అత్యధికం. కానీ 'దేవర' ఈ రికార్డును బ్రేక్ చేసింది. 'దేవర' 16వ రోజున రూ.3.65 కోట్లు వసూలు చేసి టాప్ స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో 'హను-మాన్' రూ. 3.21 కోట్లు , నాల్గో స్థానంలో 'ఆర్ఆర్ఆర్' రూ.3.10 కోట్లు, 'F2' రూ.2.56 కోట్లు వసూలు చేసి ఐదో స్థానంలో నిలిచింది.
మొదటి వారంలో దక్కిన వసూళ్లతో పోల్చితే రెండో వారంలో వసూళ్లు డ్రాప్ అయినప్పటికీ, ఫ్యామిలీ ఆడియోన్స్ సినిమాకు బ్రహ్మరథం పట్టండంతో ఈమేర కలెక్షన్లను రాబట్టింది. 'దేవర' మొదటి పార్ట్ సూపర్ హిట్ కావడంతో, రెండో పార్ట్‌పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక ఆచార్య వంటి ఫ్లాప్ తర్వాత కొరటాల దర్శకత్వం వహించిన సినిమా ఇదే. విపరీతమైన నెగిటివిటీని తట్టుకుని మరి ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో కనిపించి మెప్పించారు. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా కనిపించారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియం అయ్యారు.
-
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
భారీగా ఆస్తులు కూడబెట్టిన త్రిష.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో వీటిపై తీవ్ర చర్చ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications