ఎన్టీఆర్‌తో విభేదాలపై నోరు విప్పిన రాజీవ్ కనకాల.. ఫోన్ చేస్తే అలా చేశారంటూ

యంగ్ టైగర్ ఎన్టీఆర్, నటుడు రాజీవ్ కనకాల మధ్య ఉన్న స్నేహం తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన బంధం. వీరి స్నేహం నేటిది కాదు... తారక్ మొదటి సినిమా 'స్టూడెంట్ నెం. 1' రోజుల నుంచి మొదలై, దాదాపు పాతికేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతోంది. 'స్టూడెంట్ నెం. 1' సినిమా పూర్తయిన తర్వాత రాజీవ్ కనకాల ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ఒక మాటన్నారు. నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోను... నన్ను కూడా మర్చిపోవు కదా? అని రాజీవ్ అడిగితే, దానికి ఎన్టీఆర్ కూడా, నిన్ను మర్చిపోను, మనం ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్‌గా ఉంటామని మాటిచ్చారు.

ఆ మాటకు కట్టుబడి ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ నటించిన అనేక సినిమాల్లో రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో కనిపించడం, ఇద్దరూ కలిసి పర్యటనలకు వెళ్లడం, పలు కార్యక్రమాలకు హాజరవడం వీరి బంధానికి నిదర్శనం. వీరి కుటుంబాల మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. అయితే, ఇంతటి బలమైన స్నేహంపై కొన్ని సంవత్సరాలుగా కొన్ని పుకార్లు వైరల్ అవుతూ వచ్చాయి. ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మధ్య విభేదాలు వచ్చినట్టు ప్రచారం జరిగింది. ముఖ్యంగా, 'అశోక్' సినిమా సమయంలో వీరిద్దరి మధ్య మాటమాట పెరిగి మనస్పర్థలు వచ్చాయని గుసగుసలు వినిపించాయి.

NTR-Rajeev Kanakala Rift Rumours The Truth Behind 25 Years of Friendship Rajeev Reveals NTR s Advice on Gossip

ఈ విషయంలో రాజీవ్ కనకాల ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో క్లారిటీ ఇచ్చినా, ఆ ప్రశ్న మాత్రం ఆయన్ను వదలకుండా వెంటాడుతూనే ఉంది. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మరోసారి రాజీవ్ ఈ పుకార్లపై మాట్లాడారు. ఎన్టీఆర్‌తో విభేదాల వార్తలపై క్లారిటీ ఇస్తూ రాజీవ్ కనకాల షాకింగ్ విషయం వెల్లడించారు. మా మధ్య గొడవలు ఎప్పుడు జరిగాయో మాకే తెలియడం లేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అలాంటి వార్త ఒకటి ఏడెనిమిదేళ్ల క్రితమే మొదలై వైరల్ అయినప్పుడు, తాను వెంటనే ఎన్టీఆర్‌కు ఫోన్ చేసి, ఇలాంటి వార్త వస్తోంది, ఏం చేయాలి? అని అడిగారట. అప్పుడు ఎన్టీఆర్ ఇచ్చిన సమాధానం గురించి రాజీవ్ వివరించారు.

నువ్వు కంగారు పడకు. ఇలాంటివి కామన్‌గా వస్తుంటాయి. ముందు ముందు ఇంకా ఎక్కువ వస్తాయి. నీ దగ్గరకు కూడా వచ్చి అడుగుతారు. వాటిని పట్టించుకుంటే ఇంకా ఎక్కువ చేస్తారు. లేనిది ఉన్నట్టు క్రియేట్ చేస్తుంటారు. నువ్వు అస్సలు పట్టించుకోవద్దు," అని తారక్ ముందే చెప్పినట్లు రాజీవ్ కనకాల వెల్లడించారు.

గతంలో కూడా రాజీవ్ కనకాల ఈ విషయంపై మాట్లాడారు. "నాన్నకు ప్రేమతో", "జనతా గ్యారేజ్" వంటి చిత్రాల్లో ఎన్టీఆర్‌తో కలిసి నటించాను. మా మధ్య విభేదాలు ఉంటే ఆ సినిమాల్లో ఎందుకు నటిస్తాను? అని రాజీవ్ ప్రశ్నించారు. అలాగని ఎన్టీఆర్ ప్రతి సినిమాలో తాను నటించాలంటే కుదరదని, అది పూర్తిగా దర్శకుల ఛాయిస్ అని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ నాకంటే చిన్నవాడు. మా స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉంటుందంటూ తమ బంధంపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+