ఎన్టీఆర్ సర్ప్రైజ్ చేస్తాడు.. చాలా నేర్చుకున్న - హృతిక్ రోషన్
గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నారు. ప్రస్తుతం 'వార్ 2' సినిమాతో బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు ఎన్టీఆర్. అయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ 'వార్' సినిమాకు సీక్వెల్‌గా వస్తుంది. ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని భావిస్తునారు. ఈ సినిమా తారక్ బాలీవుడ్ డెబ్యూ చిత్రం కావడంలో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
స్పై యూనివర్స్ లో భాగంగా ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, షారుక్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్ ఏజెంట్లుగా కనిపించారు. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా ఏజెంట్ గా మారబోతున్నారు. ఇక రీసెంట్ గా ఓ ఈవెంట్ లో హృతిక్ రోషన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయడం నాకు చాలా అద్భుతమైన విషయాలను నేర్పిందని హృతిక్ రోషన్ చెప్పారు. ఆయనకు కృతజ్ఞతతో ఉంటాను. వార్-2 సినిమాలో షూటింగ్ చాలా తేలికగా జరిగిపోయింది. ఇప్పటివరకు నా కెరీర్ లో అంత ఈజీగా అయిపోతున్న సినిమా ఇదే అని వ్యాఖ్యానించారు. ప్రతి షెడ్యూల్ ఎంతో పర్‌ఫెక్ట్‌గా అద్భుతంగా ప్లాన్ చేశారని.. ఆదిత్య చోప్రా, అయాన్ ముఖర్జీ వల్లనే ఇది సాధ్యమైందన్నారు. 'వార్' పార్ట్-1 కంటే ఈ సినిమా భారీగా బెటర్ గా ఉండబోతోందన్నారు.
హృతిక్ -ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ హైలైట్ గా ఉంటాయని అంటున్నారు. అంతే కాకుండా ఈ మూవీలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య అదిరిపోయే డ్యాన్స్ సీక్వెన్స్ కోసం ప్లాన్ చేస్తున్నారని టాక్ నడిచింది. ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేసారని, దాదాపు 500మంది డ్యాన్సర్లు పాల్గొన్నారని జోరుగా ప్రచారం జరిగింది. తమకి తామే పోటీ అనేలా చెలరేగే ఈ ఇద్దరు డాన్సర్లు.. ఈసారి కలిసి డాన్స్ చేస్తే థియేటర్లు తగాలబడిపోవడం గ్యారంటీ అని.. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు లానే ఈ సాంగ్ కూడా వండర్స్ క్రియేట్ చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications