టీమిండియా క్రికెటర్ అకౌంట్ నుంచి ఆ హీరోయిన్‌కు రూ.60 కోట్లు ట్రాన్స్‌ఫర్ ..?
టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ వైవాహిక జీవితం గురించి గత కొద్దిరోజులుగా అనేక వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. చాహల్ అతని భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటున్నారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది. ధనశ్రీ వర్మ డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా , సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా కూడా ఆమె ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు.
ధనశ్రీ వర్మ తెలుగులో హీరోయిన్‌గా కూడా నటిస్తోంది. అయితే గత కొంతకాలంగా యుజ్వేంద్ర చాహల్,ధనశ్రీ వర్మల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో వీరు వీడిగా ఉంటున్నారనే ప్రచారం ఊపందుకుంది.ఇదే సమయంలో చాహల్ తన భార్య ధనశ్రీతో ఉన్న ఫొటోలన్నింటినీ తొలగించాడు. ధనశ్రీ కూడా చాహల్‌ను అన్‌ఫాలో చేసింది. అంతకు ముందు ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తన పేరు నుంచి భర్త పేరుని తొలగించింది.

దీంతో అప్పటి నుంచి వీరి విడాకుల గురించి పుకార్లు చేస్తున్నాయి. ఇప్పుడు ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేయడంతో ఇప్పుడు నిజంగానే విడాకులు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో చాహల్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. "నిజమైన ప్రేమ చాలా అరుదు. నా పేరు కూడా అలాంటిదే" అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు చాహల్. దీంతో చాహల్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
సరిగ్గా ఇదే సమయంలో చాహల్ , ధనశ్రీ వర్మ విడాకులు భరణం గురించి కూడా ఓ వార్త వైరల్‌గా మారింది. భరణం క్రింద చాహల్ నుంచి ధనశ్రీ వర్మ దాదాపు రూ.60 కోట్లు తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు విడాకుల వార్తలపై చాహల్ , ధనశ్రీ వర్మ స్పందిండం లేదు. విడాకుల వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉండటం వల్లే వీరు స్పందించడం లేదని తెలుస్తోంది. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం చాహల్ , ధనశ్రీ వర్మ విడాకులు, భరణం గురించిన వార్త మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications