OGTrailer: డెత్ కోటా కన్ఫమ్ అంటా..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ "ఓజీ" సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మూవీ నుంచి రిలీజైన ఒక్కో పోస్టర్, సాంగ్స్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. సాహో మూవీ తర్వాత సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాలో పవర్‌స్టార్ పవన్ కల్యణ్ టైటిల్ రోల్ లో కనిపించనున్నారు. ఓజాస్ గంభీరా పాత్రలో విధ్వంసం సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా ఓజీ మూవీ రిలీజ్ కానుంది. ఇక ఓజీ మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Death quota….confirm anta!! 🤙🏻🤙🏻
— DVV Entertainment (@DVVMovies) September 18, 2025
The most awaited #OGTrailer on Sep 21st.#OG #TheyCallHimOG pic.twitter.com/lmAo1CkdAU
ఓజీ ట్రైలర్ పై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ట్రైలర్ ను సెప్టెంబర్ 21న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు రిలీజ్ కానున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ ట్రైలర్ ఫుల్ యాక్షన్ ప్యాకెడ్ గా ఉండనుందని సమాచారం. మరోవైపు అదే రోజు అంటే సెప్టెంబర్ 21 తేదీనే ప్రీ- రిలీజ్ వేడుకను నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.
ఇక తాజాగా ఓజీ సినిమా టికెట్ల రేట్లను ఏపీ ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం మొదటి 10 రోజులకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. పెంచిన టికెట్ ధరలు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబరు 4 వరకు అమల్లో ఉంటాయని జీవోలో స్పష్టంగా పేర్కొంది. ఇక తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. అలాగే ఓజీ సినిమాకు ప్రీమియర్స్ వేయాలని నిర్ణయించారు. అర్ధరాత్రి 1 గంటలకు ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. ప్రీమియర్ షోకు టికెట్ ధర రూ. 1000 గా నిర్ణయించారు.

ఇక మల్కాజ్ గిరి సాయిరాం థియేటర్ లో ఇప్పటినుంచే ఓజీ హడావుడి మొదలైంది. ఈ మూవీని 24 సెప్టెంబర్ రాత్రి 9 గంటల షో కోసం ఫ్యాన్స్ ఇప్పటికే 1200 కేజీల పేపర్లను సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్క్రీన్ కనపడదు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీకి తాజాగా యూ బై ఏ సర్టిఫికెట్ వచ్చింది. అలాగే రన్ టైమ్ కూడా 2 గంటల 30 నిమిషాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది.












Click it and Unblock the Notifications