రాజమౌళి దర్శకత్వాన్నే డామినేట్ చేసిన ఏకైక హీరో అతనే..!
దర్శకుడు ధీరుడు రాజమౌళి క్రేజ్ గురించి కొత్తగా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండ వరుస సినిమాలు హిట్ కొడుతున్న దర్శకుడు. రాజమౌళి పేరు చెప్పగానే తెలుగు ఇండస్ట్రీ బాక్సాఫీస్ రికార్డుల గుర్తుకు వస్తాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్‌లను సూపర్ స్టార్లను చేసిన ఘనత కచ్చింతంగా రాజమౌళికే దక్కుతుంది. ముఖ్యంగా బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు రాజమౌళి.
ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి తన సత్తా చాటారాయన. అలాంటి దర్శకుడుతో సినిమా చేయాలని హీరో, హీరోయిన్స్ అయిన కలలు కంటారు.అయితే ఓ హీరో ఏకంగా రాజమౌళినే తన నటనతో డామినేట్ చేశారు. ఆ హీరో మరెవ్వరో కాదు.. మాస్ రాజా రవితేజ. రాజమౌళి, రవితేజ కాంబినేషన్‌లో విక్రమార్కుడు సినిమా వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. సాధారణంగా రాజమౌళి సినిమాల్లో హీరోల కన్నా,ఆయనకే ఎక్కువ ప్రశంసలు దక్కుతాయి.అయితే ఈ సినిమాలో రాజమౌళి దర్శకత్వం కన్నా రవితేజ యాక్టింగ్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు.నార్త్ జనాలు సైతం రవితేజ యాక్టింగ్‌కు ఫిదా అయ్యారు.

ఆ తర్వాత ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేసినప్పటికీ, రవితేజలా మాత్రం ఏ హీరో చేయలేకపోయారని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ సందర్భంలో తెలిపారు. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌లో కనిపించారు. విక్రమ్ సింగ్ రాథోడ్, అత్తిలి సత్తి ఇలా దొంగ , పోలీసు పాత్రల్లో కనిపించి మెప్పించారు.2006లో విడుదలైన ఈ సినిమాలో అనుష్క హీరోయిన్‌గా నటించారు.ఎం.ఎం. కీరవాణి సంగీత అందించారు. 54 కేంద్రాల్లో 100 రోజుల వేడుకను జరుపుకుంది ఈ చిత్రం. ₹ 18.9 కోట్లతో బడ్జెట్లతో తెరకెక్కిన ఈ సినిమా ₹ 25 కోట్లకు పైగా కలెక్షన్‌లను సాధించింది.












Click it and Unblock the Notifications