పేరుకే స్టార్ హీరో 13 ఏళ్లుగా ఒక్క హిట్ లేదు

హీరోలకు హిట్స్ అండ్ ఫ్లాప్స్ అనేవి సర్వ సాధారణం. ఫ్లాప్ వచ్చినప్పుడు డీలా పడడం, హిట్ వచ్చినప్పుడు పొంగిపోవడం అనేది హీరోల జీవితాల్లో కామన్‌గా జరిగేదే. అయితే ఓ హీరో 13 ఏళ్లుగా వరుసగా ఫ్లాప్స్‌ను చవి చూస్తూనే ఉన్నాడు. ఆ హీరో మరెవరో కాదు.. తమిళ స్టార్ హీరో సూర్య. తమిళంలో చాలమంది స్టార్ హీరోలు ఉన్నారు. అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోలు టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. కానీ వీరిద్దరికి రాని పేరు సూర్యకు వచ్చింది.

విలక్షణ నటుడుగా సూర్యకు మంచి పేరుంది. ఎటువంటి క్యారెక్టర్ అయిన ఈజీగా పోషిస్తారనే గుర్తింపు సూర్యకు ఉంది. 2001లో వచ్చిన 'నంద' చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. 'గజినీ', 'కాక్క కాక్క', 'సింగం', '7aum అరివు' వంటి చిత్రాలతో సూర్య స్టార్ హీరోగా ఎదిగారు.సూర్య నటించిన గజిని చిత్రం 2005లో విడుదలైంది. ఈ చిత్రం తమిళ చిత్ర పరిశ్రమలో ఒక మైలురాయిగా నిలిచింది. 2010లో సూర్య నటించిన 'సింగం' చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. గత కొంతకాలంగా సూర్య నటించిన సినిమాలు విజయాలు సాధించడం లేదు. ఇంకా చెప్పాలంటే సూర్య హిట్ కొట్టి 13 ఏళ్లు అయింది.

one and only hero who has not had a hit in 13 years

2013లో వచ్చిన సింగం( యముడు 2) సినిమా తర్వాత సూర్యకు సరైన హిట్ పడలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన కంగువా సినిమా కూడా అభిమానులను నిరాశ పరిచింది. అయితే వెండితెర మీద ఫెయిల్ సూర్య ఓటీటీల్లో మాత్రం అదరగొట్టారు. ఆకాశమే నీ హద్దురా, జైభీమ్ వంటి సినిమాలతో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు సూర్య. అయితే వెండితెర మాత్రం తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నారు. తాజాగా ఆయన నటించిన రెట్రో సినిమా కూడా అనుకున్నంత విజయాన్ని నమోదు చేయలేకపోయింది. దీంతో 13 ఏళ్లుగా సరైన హిట్ లేక సూర్య సతమతం అవుతున్నారు. దీంతో సూర్య అభిమానులు పూర్తి నిరాశలో మునిగిపోయారు. సూర్య ప్రస్తుతం నటిస్తోన్న సినిమాలతో అయినా కమ్ బ్యాక్ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+