రాజమౌళితో సినిమా చేయనన్న ఏకైక తెలుగు హీరో అతడే
దర్శకుడు ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్‌లో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుస సినిమాలు హిట్ కొడుతున్న దర్శకుడు ఆయన. రాజమౌళి పేరు చెప్పగానే తెలుగు ఇండస్ట్రీ బాక్సాఫీస్ రికార్డుల గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకుడు. అలాంటి దర్శకుడుతో సినిమా చేయాలని ఏ హీరో అయిన కలలు కంటారు. కానీ రాజమౌళి సినిమాలో నటించే అవకాశం వచ్చినా , చేయనని చెప్పిన హీరో ఒకరు ఉన్నారనే విషయం చాలామందికి తెలియదు.
ఆ హీరో మరెవ్వరో కాదు రెబర్ స్టార్ ప్రభాస్. అవును ఇది నిజమే. కెరీర్ స్టార్టింగ్‌లోనే ప్రభాస్‌తో మూవీ చేయాలని రాజమౌళి ప్లాన్ చేశారట. రాజమౌళి తొలి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ కథను తొలుత ప్రభాస్‌తో తీయడానికి రెడీ అయ్యారట. కథను కూడా వినిపించారట. అయితే స్డూడెంట్ జైలుకు వెళ్లి లాయర్ కావడం ఎలా అని, దీనికి ప్రేక్షకులు కనెక్ట్ కారని చెప్పి ఆ సినిమాను ప్రభాస్ రిజెక్ట్ చేశారట. దీంతో ఈ సినిమాను ఎన్టీఆర్‌తో తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు రాజమౌళి.

ఈ విషయాన్ని రాజమౌళి చాలాసార్లు పలు ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది. ఇలా రాజమౌళి కథను రిజెక్ట్ చేసిన ఏకైక తెలుగు హీరోగా ప్రభాస్ నిలిచాడు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో మూడు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. . 'ఛత్రపతి', 'బాహుబలి 1', 'బాహుబలి 2' మూడు చిత్రాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్స్‌గా నిలిచాయి. ముఖ్యంగా 'బాహుబలి 2'తో తెలుగు సినిమా సత్తాను అంతర్జాతీయ చాటారు. రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గ్లోబల్ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించడానికి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించనున్నారు.












Click it and Unblock the Notifications