తెలుగు స్టార్ యాంకర్ కు క్యాస్టింగ్ కౌచ్
తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం. ఎంతటివారైనా ఏదో ఒక దశలో వీటిని ఎదుర్కోక తప్పదు. పరిశ్రమలో ఉన్న టాప్ యాంకర్స్ కూడా దీన్ని ఎదుర్కొన్నారు. పరిశ్రమలో మంచి పేరున్న యాంకర్లలో శ్యామల ఒకరు. ప్రోగ్రామ్స్ చేయడంతోపాటు సీరియల్స్ లో కూడా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. తర్వాత హోస్ట్ గా మారింది.
పలు సినిమాల్లో కూడా కీలకపాత్రల్లో నటించింది. విరూపాక్ష సినిమాలో తన అభినయం అందరినీ ఆకట్టుకుంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఓ వార్త బాగా ట్రెండ్ అవుతోంది. ఓ ఇంటర్వ్యూలో శ్యామల మాట్లాడుతూ సీరియల్స్ కు కెమెరామెన్ గా చేసే ఒకతను తనను బాగా ఇబ్బంది పెట్టడాని తెలిపింది. అర్థరాత్రి సమయంలో కాల్స్ చేసి అసభ్యకరమైన మాటలతో టార్చర్ చేసేవాడని వెల్లడించింది.

ఓరోజు అతను చేసిన కాల్ ను శ్యామల అమ్మ లిఫ్ట్ చేశారు. మీకు మగదిక్కు లేదని, తాను చెప్పింది వినాలంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడని, దీన్నిగురించి పరిశ్రమలోని పెద్దలకు ఫిర్యాదు చేశానని, అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోలేదన్నారు. ఈ విషయంలో తాను చాలా హర్ట్ అయినట్లు వెల్లడించింది. తర్వాత ఎలాగోలా ఆ టార్చర్ నుంచి బయటపడినట్లు శ్యామల చెప్పింది. పరిశ్రమలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయంది ప్రస్తుతం తను చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒక హీరోయిన్ లేదంటే ఒక నటి తమకు ఎదురైన అనుభవాలను చెబుతూనే ఉంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో అవకాశాల కోసం లొంగిపోవాల్సి వచ్చేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. లొంగకపోతే అవకాశాలు వచ్చేవి కావని, సినిమాలే లోకంగా ఒక లక్ష్యం పెట్టుకొని వచ్చే తాము క్యాస్టింగ్ కౌచ్ కు దూరంగా ఉండటానికి ప్రయత్నించేవారిమని చెబుతుంటారు.












Click it and Unblock the Notifications