కీర్తి సురేష్‌తో తండ్రిగా, లవర్‌గా, భర్తగా నటించిన ఏకైక హీరో
హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా 'మహానటి' సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.
కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదనే గుర్తింపు దక్కించుకున్నారు.ఇటీవల కాలంలో కీర్తి సురేష్‌కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్ లాగేస్తున్నారు.ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి ట్యాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది.

నేటితరంలో పద్దతిగా కనిపిస్తే అవకాశాలు రావని గ్రహించిన కీర్తి సురేష్, ఈ రూల్స్‌ను బ్రేక్ చేస్తోంది. కీర్తి సురేష్ రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. కీర్తి సురేష్ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ఓ రేంజ్‌లో అందాలను ఆరబోసింది. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. ఇక గతేడాది కీర్తి సురేశ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 15 ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానటి సర్ ప్రైజ్ ఇచ్చింది.
కాలేజ్ డేస్ నుంచే లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది. తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది కీర్తి సురేష్.తన ప్రియుడు ఆంటోనినే కీర్తి సురేష్ వివాహం చేసుకుంది.డిసెంబర్ 12న అతి కొద్దిమంది సమక్షంలో కీర్తి సురేష్ వివాహం జరిగింది.ఇదిలా ఉంటే కీర్తి సురేష్ గురించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.ఓ హీరో కీర్తి సురేష్‌తో విభిన్న పాత్రల్లో కనిపించారు.
కీర్తి సురేష్‌తో తండ్రిగా, లవర్‌గా, భర్తగా నటించి సదరు హీరో ఇప్పుడు హాట్ టాపిక్‌గా నిలిచారు.ఆ హీరో మరెవ్వరో కాదు.. నటుడు దిలీప్. మలయాళంలో దిలీప్‌కు మంచి క్రేజ్ ఉంది. కీర్తి సురేష్ బాలనటిగా చేసినప్పుడు దిలీప్‌కు కూతురుగా నటించింది. ఆ తర్వాత దిలీప్‌కు లవర్‌గా నటించింది.ఈ విషయాన్ని కీర్తి సురేష్ స్వయంగా ఓ ఇంటర్య్వూలో చెప్పడం జరిగింది. దిలీప్ నా చిన్నప్పుడు ఎలా ఉన్నారో , ఇప్పటికీ అలానే ఉన్నారని , ఆయన ఎటువంటి మార్పు లేదని కీర్తి సురేష్ వెల్లడించింది.ఓ సందర్భంలో అంకుల్ పిలిస్తే.. నన్ను అలా పిలవకు, కావాలంటే అన్న అని పిలమని చెప్పారని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కీర్తి సురేష్ దిలీప్ గురించి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications