తెలుగులో టాప్-1 హీరో అతడే... ఆర్మాక్స్ సంస్థ సర్వే
తెలుగు సినీ పరిశ్రమ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. తెలుగులో నిర్మితమవుతున్న చిత్రాలు దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా పేరు తెచ్చుకుంటున్నాయి. అందుకు ఉదాహరణలు.. బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు. తెలుగులో ప్రస్తుతం నిర్మాణమవుతున్న స్టార్ హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగానే రూపుదిద్దుకుంటున్నాయి. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. తెలుగు స్టార్ హీరోల చిత్రాలకు బాలీవుడ్ లో కూడా భారీగా డిమాండ్ ఉంది.
డార్లింగ్ ప్రభాస్
ఈ నేపథ్యంలో ఆర్మాక్స్ సంస్థ తెలుగులో టాప్-10 హీరోలు ఎవరు? అనే విషయంపై సర్వే చేసింది. ఆ సర్వే ప్రకారం తెలుగులో నెంబర్ వన్ హీరోగా డార్లింగ్ ప్రభాస్ నిలిచారు. సినిమా హిట్, ఫ్లాప్ అనేవాటితో సంబంధం లేకుండా కనీసం రూ.350 నుంచి రూ.400 కోట్ల వరకు డార్లింగ్ సినిమాలు కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. ఖాన్ త్రయాన్ని కూడా వెనక్కి నెట్టేసి ఒకరకంగా ఇండియాలోనే టాప్-1 హీరోగా నిలిచాడని చెప్పొచ్చు. డార్లింగ్ ప్రభాస్ తర్వాత స్థానంలో టాప్-2 హీరోగా మహేష్ బాబు నిలిచారు. పాన్ ఇండియా సినిమాలు చేయనప్పటికీ భారీగా అభిమానులుండటం ప్రిన్స్ కు ప్లస్ పాయింట్. ఈ జాబితాలో ఏయే స్థానాల్లో మన హీరోలు నిలిచారో తెలుసుకుందాం.

టాప్-1 ప్రభాస్
టాప్-2 మహేష్ బాబు
టాప్-3 జూనియర్ ఎన్టీఆర్
టాప్-4 అల్లు అర్జున్
టాప్-5 రామ్ చరణ్
టాప్-6 పవన్ కల్యాణ్
టాప్-7 నాని
టాప్-8 రవితేజ
టాప్-9 చిరంజీవి
టాప్-10 విజయ్ దేవరకొండ
కొందరు మాత్రం ఈ జాబితాను కొట్టి పడేస్తున్నారు. జాబితాలో బాలయ్య లేకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. టాప్-3లో మెగా హీరోలెవరూ లేరని.. అంతేకాకుండా ఇదంతా ఫేక్ లిస్టంటూ కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications